Allu Arjun : డిఫరెంట్ లుక్.. పుష్ప నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
అల్లుఅర్జున్ (Allu Arjun ) తన నెక్స్ట్ మూవీ కోసం పూర్తిగా డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడట
- Thota Vamshi Kumar
- Published On : March 20, 2026 / 07:52 PM IST
Allu Arjun Upcoming Movie Look Gossip viral
Allu Arjun : అల్లుఅర్జున్ తన నెక్స్ట్ మూవీ కోసం పూర్తిగా డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడట. ఇప్పటివరకు ఆయననెప్పుడూ చూడని రగ్గడ్, రియలిస్టిక్ లుక్‌లో కనిపించబోతున్నాడట. అందుకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నెక్స్ట్ ప్రాజెక్టులో పాత్ర కోసం స్పెషల్ ఫిజికల్ ట్రైనింగ్, కొత్త స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మీద ఫోకస్ చేశాడట. లుక్ కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురావడానికి ఇంటర్నేషనల్ స్టైలిస్టులతో పనిచేయబోతున్నాడని టాక్. ఈ సినిమా కోసం గడ్డం, హెయిర్ స్టైల్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి విషయంలో రియలిస్టిక్ టచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
Neha Shetty : పండగ పూట పద్దతిగా టిల్లు బ్యూటీ రాధిక.. నేహాశెట్టి క్యూట్ ఫోటోలు వైరల్
బన్నీ కమిట్ అయినట్లు చెప్తున్న సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఉండొచ్చని అంటున్నారు. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో పాటు రా యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. షూటింగ్ ఎక్కువగా నార్త్ ఇండియాలో.. బిహార్, ఉత్తరప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో జరగబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట.
ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. అలాగే మ్యూజిక్ కోసం టాప్ కంపోజర్‌ను ఫిక్స్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని సమాచారం. సినిమా టెక్నికల్‌గా కూడా హైస్టాండర్డ్స్‌తో తెరకెక్కించాలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారట. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్ పెంచేస్తోంది.
