సామజవరగమన సక్సెస్ అవుతుందని అనుకోలేదు: అల్లు అర్జున్

అల వైకుంఠపురం సినిమా మ్యూజిక్ కన్సర్ట్ సందడి సందడిగా జరిగింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. స్టేజిపై చివరిగా మాట్లాడిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమాననులతో ఫీలింగ్ పంచుకున్నారు. ఈవెంట్ చివర్లో శివమణి డ్రమ్స్ వాయిస్తుండగా రాములో రాములా పాటకు స్టెప్ వేసి ముగించారు. 

స్టేజిపై మాట్లాడుతూ.. :
వరుస మాస్ స్టోరీల తర్వాత సరదాగా.. సంతోషంగా ఉండే స్టోరీ చేయాలనుకున్నాం. 
అందరి మ్యూజిక్ బాండ్స్ ఉండే పాట కావాలని అడిగా. 
సామజవరగమణ పాట ఇంత సెన్సేషన్ అవుతుందని కల్లో కూడా అనుకోలేదు.
ప్రపంచం ముందు వచ్చే హీరోయిజం కంటే పెళ్లాం ముందు వచ్చే హీరోయిజం చాలా ఇదిగా ఉంటుంది. 
ఈ సినిమాలో ప్రతి పాట బాగా రాశారు. 
థమన్ ఇరగదీశావు. థ్యాంక్స్ బ్రదర్. నీకో రేంజ్ వచ్చింది.
టెక్నిషియన్ పీఎస్ వినోద్ గారికి, ఆర్ట్ డైరక్టర్ ప్రకాశ్, ఎడిటర్ నవీన్ గారికి, కొరియోగ్రాఫర్స్ కు, ఫైట్ మాస్టర్లకు మనస్ఫూర్తిగా థ్యాంక్యూ.
సుశాంత్ కు స్టోరీ సగం చెప్తేనే సినిమా చేసేశాడు.
పూజా హెగ్దే చాలా అందంగా ఉంది. 
నివేదా పెతురాజ్ సైలెంట్ కాదు రచ్చచేసింది. 
టబు గారి లాంటి ఆర్టిస్టు ఉండటం చాలా ఎంజాయ్ చేశా. 
రావు రమేశ్, రోహిణి వీళ్లంతా ట్రూ ఆర్టిస్టులు. 
ప్రొడ్యూసర్ రాధాకృష్ణ, వంశీకు స్పెషల్ థ్యాంక్స్. 

ఆనందాన్నిచ్చే వ్యక్తి డైరక్టర్ ఒక్కడే. అందరం టూల్స్ లాంటి వాళ్లం. ఈ స్థాయిలో ఉన్నానంటే త్రివిక్రమ్ గారూ ఓ కారణం. ఈ సినిమా ఎంత హిట్ అయినా అది త్రివిక్రమ్ గారి వల్లే. 

మా నాన్నకు థ్యాంక్స్. డాడీ ఐ లవ్యూ. నాకు కొడుకు పుట్టాకే అర్థమైంది. ఆర్య సినిమా చేసినప్పుడే బాగా సంపాదించా. బెస్ట్ ఫాదర్ ఆయనే. అరవింద్ గారూ బాగా డబ్బులు కొట్టేసే వ్యక్తి అని అందరూ చెప్తారు. సౌతిండియాలో నెం.1 ప్రొడ్యూసర్ గా ఉండలేరు. 

ఫ్యాన్స్ వల్ల నా గ్యాప్ వచ్చిందని కూడా తెలియదు. 
సంక్రాంతికి వెళ్లిపోతారనుకుంటే ఫ్యాన్స్ మీద నమ్మకంతో ఈ ఫంక్షన్ పెట్టాం. 

దర్బార్ సినిమా రాబోతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా రాబోతుంది. ఈ సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ రామ్.. ఎంతమంచివాడవురా సినిమా రిలీజ్ అవుతోంది. అందరి సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.