Allu Cinemas: హైదరాబాద్‌లో అల్లు మార్క్ మ్యాజిక్.. సీఎం చేతుల మీదుగా ‘అల్లు సినిమాస్’ షురూ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఘనంగా ప్రారంభమైన అల్లు సినిమాస్‌(Allu Cinemas).

Allu Cinemas grandly inaugurated by CM Revanth Reddy

Allu Cinemas: హైదరాబాద్‌ సినీ ప్రియులకు మరో అద్భుతమైన వినోద వేదిక అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోకాపేటలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ (Allu Cinemas) మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ వేడుకలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దివంగత లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.

Tejaswini: దిల్ రాజు భార్య తేజస్విని.. బ్లాక్ డ్రెస్సులో కేక ఫోటోలు

ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఈ థియేటర్స్ ఆన్‌లైన్ బుకింగ్స్ మార్చి 13 నుంచి బుక్ మై షోలో అందుబాటులోకి రానున్నాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి సాధారణ ప్రేక్షకులకు సినిమాల ప్రదర్శన మొదలవుతుంది. థియేటర్ ప్రారంభం సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ధురంధర్ 2’ సినిమాలను ప్రదర్శించనున్నారు.

ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇది ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ స్క్రీన్‌. మొత్తం 4 అత్యాధునిక స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంది. ఇందులో స్క్రీన్-1లో అత్యుత్తమ విజువల్ అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేశారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్, లగ్జరీ సీటింగ్ సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.