Allu Sirish Wedding : అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. అల్లు శిరీష్ ఫస్ట్ పెళ్లి కార్డు మెగాస్టార్ కే.. ఫోటో వైరల్..
అల్లు వారింట పెళ్లి పనులు మొదలయ్యాయి. (Allu Sirish Wedding)
- Saketh U
- Published On : February 15, 2026 / 04:22 PM IST
Allu Sirish Wedding
Allu Sirish Wedding : అల్లు వారింట పెళ్లి పనులు మొదలయ్యాయి. అల్లు శిరీష్ ఇటీవల నయనిక అనే అమ్మాయిని అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం నయనిక – అల్లు శిరీష్ దుబాయ్ లో ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒకటి కానుంది.
అల్లు శిరీష్ నయనికల పెళ్లి మార్చ్ 6న జరగనుందని సమాచారం. ఇటీవల పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెట్టారని అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో తెలిపాడు. తాజాగా నేటి నుంచి పెళ్లి పిలుపులు మొదలుపెట్టారు. అల్లు శిరీష్ పెళ్లి మొదటి పత్రికని మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖకు అల్లు అరవింద్, భార్య నిర్మల, అల్లు శిరీష్ కలిసి అందించారు.
Also Read : Couple Friendly : ‘కపుల్ ఫ్రెండ్లీ’.. క్యూట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరో హీరోయిన్.. ఫొటోలు..
చిరంజీవికి పెళ్లి పత్రిక అందించిన ఫోటోని అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికని మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాము అని రాసుకొచ్చాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. మొత్తానికి అల్లు వారింట పెళ్లి సందడి మొదలయింది. మార్చ్ 6న వీరి పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది.
