కేరళ బ్యూటీ అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడింది. కానీ, ప్రియుడు ఎవరో మాత్రం సస్పెన్స్ గా ఉంచింది. కొన్నాళ్లుగా ఒకరితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. ఇంతకీ ఆ బోయ్ ఫ్రెండ్ ఎవరా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. అమలాపాల్, అతడి మధ్య ఏముంది.. మళ్లీ కుచ్ కుచ్ హోతా హై అంటూ సోషల్ మీడియా కోడై కుస్తోంది.
తనకోసం త్యాగం ఏకంగా ఉద్యోగాన్నే త్యాగం చేసిన వ్యక్తిని తాను ప్రేమిస్తున్నానంటూ ఆమె చెప్పకనే చెప్పేసింది. కానీ, పేరు చెప్పేందుకు మాత్రం ఇష్టపడలేదు. వీరద్దరి ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బుర్కా ధరించి ఉన్న అమలాపాల్ వెంట ముంబై సింగర్ భవ్నీందర్ సింగ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.
గతంలోనూ భవ్నీందర్ ఆడై (ఆమె) సినిమా ప్రమోషన్ల సందర్భంగా.. నా ప్రియురాలిని చూసి గర్విస్తున్నాను. ఇలాంటి మూవీలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. అతను ఒక ఫొటో షేర్ చేయగా అది మరింత బలానిస్తోంది.
ఆ ఫొటోలో అతడు పైనుంచి ఫొటో తీస్తుండగా ఎవరో ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని ఉన్నట్టుగా ఉంది. ఆమె ముఖం కనిపించడం లేదు. చూస్తుంటే అది అమలాపాల్ అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
See Also | హోమో సెక్స్ అడిగాడని సీసాతో పొడిచి..