Amaravathi ki Aahwanam movie review
Amaravathi ki Aahwanam Review; భారతీయుడికి చావే లేదు అన్నట్లు హారర్ సినిమాలకు కూడా అంతం లేదు. ఎన్ని హారర్ మూవీస్ వచ్చినా ఇంకా వస్తూనే ఉంటాయి. ఒక చిన్న బడ్జెట్ లో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే జానర్ హారర్ థ్రిల్లర్. ఈ జానర్ లో పర్పెక్ట్ అటెంప్ట్ చేస్తే సక్సెస్ ఖాయం. అలాంటి సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది ఈ రోజు రిలీజైన అమరావతికి ఆహ్వానం మూవీ. చిన్న చిత్రమైనా పెద్ద విజయం దిశగా పాజిటివ్ టాక్ తో వెళ్తోంది. అసలు ఈ సినిమాలో ఉన్న సరికొత్త కథేంటి, ఎందుకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది రివ్యూలో చూద్దాం.
స్టోరీ:
అమరావతి అనే ఊరిలో జరిగిన ఒక అనూహ్య సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఊరిలో మద్యం సేవించిన స్నేహితుల్లో ఒకరు తనను తానే చంపుకుంటాడు. అతను ఎందుకిలా ప్రవర్తించాడు అనేది ఆసక్తిరేపుతుంది. సస్పెన్షన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఈశ్వర్(శివ కంఠంనేని)ది హ్యాపీ ఫ్యామిలీ. ఆయనకు మంచి వైఫ్ భానుమతి (ధన్య బాలకృష్ణ)తో పాటు అల్లరి పిల్లలైన మరదళ్లు ఉంటారు. వారిలో ఒక మరదలు భార్గవి(Amaravathi ki Aahwanam Review) (సుప్రిత) సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకోవాలని అనుకుంటుంది. బూత్ బంగ్లాలో ఒక రోజంతా ఉండి దెయ్యాలు లేవని ప్రూవ్ చేస్తుంది.
ఈ వీడియో వైరల్ కావడంతో భార్గవి ఫేమస్ అవుతుంది. నిజమైన దెయ్యాలను చూపిస్తానంటూ అమరావతి అనే ఊరికి ఆహ్వానిస్తాడు ఓ అజ్ఞాతవ్యక్తి. కుటుంబమంతా వెళ్దామని సరదా పడుతుంటే వారి సంతోషాన్ని కాదనలేక ఈశ్వర్ కూడా అమరావతికి బయలుదేరుతాడు. ఆ ఊరిలో అనూహ్య ఘటనలు జరగడం సినిమా ప్రారంభంలోనే దర్శకుడు చూపిస్తాడు. ఇదే క్రమంలో ఈశ్వర్ ఫ్యామిలీకి ఆ ఊరిలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. అమరావతిలో ఉన్న జమిందారిణి రాజేశ్వరి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆమెకు ఈశ్వర్ కు ఉన్న సంబంధం ఏంటి అనేది థియేటర్ లో చూడాల్సిందే.
రివ్యూ:
సినిమా అంటే ముడులు వేయడం, ఆ ముడులు విడదీస్తూ వెళ్లడం. ఈ ఫార్ములాను ఫాలో అవుతూ దర్శకుడు జీవీకే సినిమా ప్రారంభంలోనే అమరావతి అనే ఊరు ప్రత్యేకత ఏంటో చెప్పాడు. అక్కడ భయపెట్టే సీన్ తో సినిమా బిగినింగ్ లోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఈశ్వర్ కుటుంబం, ఆ కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో మూవీ హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. భార్గవి వీడియో వైరల్ కావడం, అపరిచితుడి ఫోన్ కాల్, ఈశ్వర్ కుటుంబం అమరావతి ఊరికి వెళ్లాలని ఫిక్స్ కావడం…ఇలా ఒక్కో సీన్ వెళ్తున్నా కొద్దీ సినిమాలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే జమిందారిణి రాజేశ్వరి పాత్రను పరిచయం చేస్తారో అక్కడ సినిమా స్టోరీ పీక్స్ కు చేరుకుంటుంది. ఇక అక్కడి నుంచి రాజేశ్వరి ఫ్లాష్ బ్యాక్, ఆమెతో ఈశ్వర్ కున్న రిలేషన్, అసలు ఆమె గతంలో ఏం జరిగింది అనే అంశాలతో సినిమా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. ఇలాంటి ఎంగేజింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఇటీవల కాలంలో ఏ హారర్ థ్రిల్లర్ మూవీలోనూ రాలేదు. ఈ సినిమాకు బలమైన స్క్రిప్ట్, ఆ పాత్రలను పర్ ఫార్మ్ చేసిన ఆర్టిస్టులు, హై క్వాలిటీగా ఉన్న టెక్నికల్ వ్యాల్యూస్ ప్రాణంగా నిలిచాయి.
అమరావతికి ఆహ్వానం సినిమాకు కాస్ట్ అండ్ క్రూ ప్రాణం పెట్టి ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేసినట్లు ప్రతి సీన్ లోనూ తెలుస్తుంటుంది. ఏదో చేసి వెళ్లిపోయాం అన్నట్లుగా ఎక్కడా అనిపించదు. మూవీ టీమ్ అంకితభావంతో పనిచేయడం వల్లే మూవీ ఔట్ పుట్ ఇంత బాగా వచ్చిందని అనుకోవచ్చు. నటీనటుల ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే ఈశ్వర్ పాత్రలో శివ కంఠంనేని సీన్స్ కు తగినట్లు నేచురల్ గా నటించాడు. ఒక్కోసారి ఫెరోషియస్ గా, ఒక్కో సీన్ లో సరదాగా, మరో సీన్ లో హుందాగా..ఇలా తన నటనలో అన్ని వేరియేషన్స్ చూపించారు. ఈశ్వర్ భార్య భానుమతిగా ధన్య అందానికి అందం పర్ ఫార్మెన్స్ కు పర్ ఫార్మెన్స్ చూపించింది. ఆమె తన కళ్లతోనే భయపెట్టింది. రాజేశ్వరి పాత్ర ఎస్తేర్ కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ గా మిగిలిపోతుంది. ఆమె క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం, ఆమె పర్ పార్మ్ చేసిన తీరు ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఇక సరదా అమ్మాయిగా సుప్రిత కూడా ఆకట్టుకుంది. అశోక్ కుమార్, హరీష్, భద్రమ్, జెమినీ సురేష్..ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కు కథలో ప్రాధాన్యత ఉంది, వీళ్లంతా తమ పాత్రలకు తగినట్లు నటించారు.
టెక్నికల్ పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ జె ప్రభాకర్ రెడ్డి మరోసారి తన ప్రతిభ చాటారు. భరద్వాజ్ మ్యూజిక్ ఈ సినిమాకో మరో అసెట్. ముఖ్యంగా బీజీఎం ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేసింది. మిగతా ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ వంకపెట్టలేని విధంగా ఉన్నాయి. ఈ సినిమా ఈ వారం అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.
మొత్తంగా భయపెడుతూ, ట్విస్టులతో మైండ్ బ్లాంక్ చేసే అమరావతికి ఆహ్వానం సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.