James Bond Reboot: 007 రీబూట్.. కొత్త ‘జేమ్స్ బాండ్’ కోసం ఆడిషన్స్.. లిస్టులో ఉన్న క్రేజీ స్టార్స్ ఎవరో తెలుసా?

కొత్త జేమ్స్ బాండ్(James Bond Reboot) కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్న అమెజాన్ ఎమ్ జీఎమ్ స్టూడియోస్.

Amazon and MGM Studios conducting auditions for new James Bond in the James Bond Reboot

  • కొత్త జేమ్స్ బాండ్ కోసం వేట
  • రేసులో నిలిచిన నలుగురు హాలీవుడ్ హీరోలు
  • డ్యూన్ దర్శకుడితో క్రేజీ రీబూట్ ప్రాజెక్ట్

James Bond Reboot: హాలీవుడ్ ఐకానిక్ స్పై ఫ్రాంచైజీ జేమ్స్ బాండ్ తదుపరి సిరీస్ కోసం అమెజాన్ ఎమ్ జీఎమ్ స్టూడియోస్ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. 2021లో వచ్చిన నో టైమ్ టు డై చిత్రంతో డేనియల్ క్రెయిగ్ బాండ్ పాత్రకు వీడ్కోలు పలికిన తర్వాత, కొత్త 007 ఏజెంట్ ఎవరనే దానిపై గ్లోబల్ స్థాయిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈసారి కేవలం స్టార్ హీరోలనే కాకుండా, బాండ్ పాత్రకు సరికొత్త ఊపిరి పోయగల ఫ్రెష్ ఫేస్ కోసం మేకర్స్ అన్వేషిస్తున్నారు. ఇందుకోసం గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్టార్ వార్స్ వంటి భారీ ప్రాజెక్టులకు పనిచేసిన ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ నినా గోల్డ్ రంగంలోకి దిగారు.

Niharika Konidela: చిలుకపచ్చ రంగు డ్రెస్సులో రామచిలకలా.. గ్లామర్ రచ్చ చేస్తున్న నిహారిక కొణిదెల

ప్రస్తుతం కొత్త జేమ్స్ బాండ్ రేసులో సోషల్ మీడియా వేదికగా పలువురు హాలీవుడ్ నటుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కిక్-యాస్, బుల్లెట్ ట్రైన్ చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆరోన్ టేలర్-జాన్సన్ ముందంజలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అతనితో పాటు సూపర్‌మ్యాన్ ఫేమ్ హెన్రీ కావిల్, తన నటనతో యూత్‌ను ఆకట్టుకుంటున్న యువ నటుడు జాకబ్ ఎలోర్డి, మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్ సిరీస్ ద్వారా పాపులర్ అయిన కల్లమ్ టర్నర్ వంటి నటులు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే స్టూడియో మాత్రం ఎవరి పేరును అధికారికంగా ఖరారు చేయకుండా, ట్యాలెంట్ ఉన్న కొత్త వాళ్లకు కూడా ఆడిషన్ల ద్వారా అవకాశం ఇస్తామని ప్రకటించింది.

ఈ సరికొత్త బాండ్(James Bond Reboot) రీబూట్ ప్రాజెక్టును విజువల్ వండర్‌గా మార్చేందుకు ప్రఖ్యాత దర్శకుడు డెనిస్ విల్లెనూవ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. డ్యూన్ వంటి దృశ్య కావ్యాలను అందించిన విల్లెనూవ్ బాండ్ ప్రపంచాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించనున్నారు. దీనికి తోడు పీకీ బ్లైండర్స్ సృష్టికర్త స్టీవెన్ నైట్ స్క్రిప్ట్ అందిస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బాండ్ వ్యక్తిత్వంలోని లోతైన కోణాలను చూపేలా ఈ కథ ఉండబోతోంది. ఈ ఎంపిక ప్రక్రియ 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, 2027లో షూటింగ్ ప్రారంభమై 2028లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి జేమ్స్ బాండ్ సినిమా లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.