Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్.. కల్కి నుంచి అమితాబ్ వీడియో వచ్చేసింది..

తాజాగా నేడు కల్కి సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు.

Kalki 2898 AD : ‘అశ్వత్థామ’గా అమితాబ్ బచ్చన్.. కల్కి నుంచి అమితాబ్ వీడియో వచ్చేసింది..

Amitabh Bachchan Character Revealed from Prabhas Kalki 2898AD Movie

Kalki 2898 AD : ప్రభాస్(Prabhas) నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898AD’ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత అశ్విని దత్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఎన్నికల టైం కావడంతో కల్కి మరోసారి వాయిదా పడింది.

Also Read : My Dear Donga Review : ‘మై డియర్ దొంగ’ రివ్యూ.. అమ్మాయికి దొంగ నచ్చితే..

తాజాగా నేడు ఈ సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ని రివీల్ చేసారు. ఐపీఎల్ మూడ్ లో అందరూ ఉండగా దానికి ఇంకొంచెం హ్యాపినెస్ ఇస్తూ స్టార్ స్పోర్ట్స్ లో అమితాబ్ బచ్చన క్యారెక్టర్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా కనపడబోతున్నట్టు, ద్వాపర యుగం నుంచి విష్ణువు చివరి అవతారం కల్కి కోసం ఎదురుచూస్తున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా తెలిపారు.

దీంతో మరోసారి కల్కి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా 6000 సంవత్సరాల కథతో జరుగుతుందని, ఈ సినిమాలో పురాణాల ప్రకారం చెప్పిన ఏడుగురు చిరంజీవులు ఉంటారని వార్తలు వచ్చాయి. అమితాబ్ ని అశ్వత్థామ క్యారెక్టర్ గా చూపించడంతో అంతా ఈ వార్తలు నిజమే అవుతాయని భావిస్తున్నారు. కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.