Amitabh Bachchan: మన ఇద్దరి స్థితి ఒకటే అంటూ.. సామాన్యుడితో పోలుచుకున్న అమితాబ్ బచ్చన్!
ఆయన నటనతో మనల్ని అలరిస్తూ వస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఇటీవలే రెండోసారి కరోనా భారిన పడగా కొంతకాలం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోలుకోవడంతో తిరిగి షూటింగ్స్ లో బిజీ అవుతున్న బిగ్ బీ తనను తాను ఒక సాధారణ వ్యక్తితో పోల్చుకుంటూ....
- gum 95921
- Published On : September 8, 2022 / 12:04 PM IST
Amitabh Bachchan Compared himself with a Common man
Amitabh Bachchan: ఇప్పటికీ ఆయన నటనతో మనల్ని అలరిస్తూ వస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనను తాను ఒక సాధారణ వ్యక్తితో పోల్చుకుంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన నటించిన “బ్రహ్మాస్త్ర” ఈ శుక్రవారం విడుదలవుతుండగా, ఫ్యామిలీ డ్రామాతో వస్తున్న మరోచిత్రం “గుడ్ బై” అక్టోబర్ లో విడుదలకు సిద్దమవుతుంది.
Brahmastra: బాయ్‌కాట్ ట్రెండ్‌పై రణ్‌బీర్ వ్యాఖ్యలు.. షంషీరా ఫెయిల్యూర్‌కి అదే కారణమట!
ఇటీవలే రెండోసారి కరోనా భారిన పడిన బిగ్ బీ కొంతకాలంగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కోలుకోవడంతో తిరిగి షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. ఇదే క్రమంలో అమితాబ్ వ్యాఖ్యాతగా “కౌన్ బనేగా కరోడ్ పతి” టీవీ షోలో కూడా వ్యహరిస్తున్నారు. ఇటీవల ఆ షోలో వచ్చిన ఒక కంటెస్టెంట్… తన తీరికలేని ఉద్యోగ జీవితం గురించి ప్రస్తావించాడు.
అది విన్న అమితాబ్.. తానూ రోజుకు 14గంటలు పనిచేస్తున్నట్టు, ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు తన షూటింగ్ టైమింగ్స్ మరియు డే టు డే టైమ్ టేబుల్ గురించి అమితాబ్ చెప్పారు. అదే మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అంటూ.. తనను తానూ ‘కేబిసి’ కంటెస్టెంట్ తో పోల్చుకున్నారు. అయితే ఇప్పటి స్టార్ హీరోలు రోజుకు 8గంటల పని చేయడమే కష్టమవుతుంటే బిగ్ బీ మాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ లు చేస్తూ ఇప్పటివాళ్ళకు ఆదర్శమవుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
