అమితాబ్ బచ్చన్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, ఫిబ్రవరి 15 నాటికి 50 సంవత్సరాలు అయ్యింది.
అమితాబ్ బచ్చన్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, ఫిబ్రవరి 15 నాటికి 50 సంవత్సరాలు అయ్యింది. 1969 ఫిబ్రవరి 15 న అమితాబ్ నటించిన మొదటి సినిమా ‘సాథ్ హిందుస్థానీ’ షూటింగ్ ప్రారంభం అయ్యింది. అప్పటినుండి అంచెలంచెలుగా ఎదుగుతూ, బాలీవుడ్ బిగ్ బీ గా ఎదిగిన అమితాబ్ సినీ ప్రస్థానం.. ఎందరికో ఆదర్శం.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అగ్ర నటుడిగా కొనసాగిన తర్వాత, వరస ఫ్లాప్‌లు, ఆర్థిక ఇబ్బందులు, చేతిలో సినిమాలు లేని పరిస్థితి.. కౌన్ బనేగా కరోడ్‌పతి షో కి హోస్టింగ్ చేసి, తిరిగి ఫామ్‌లోకి రావడం.. ఇలా.. ఎన్నో ఎత్తు, పల్లాలను చూసారు అమితాబ్.. ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చి, 50 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా, పలువురు సినీ ప్రముఖులు బిగ్ బీ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అమితాబ్ ఫోటోతో డిజైన్ చేసి, ఐకాన్ అని రాసి ఉన్న టీ-షర్ట్ వేసుకున్న పిక్ షేర్ చేస్తూ.. ఐకాన్.. ఆయనంటే నాకు అంతకంటే ఎక్కువ.. నా తండ్రి, బెస్ట్ ఫ్రెండ్, గైడ్, బెస్ట్ క్రిటిక్, హీరో.. 50 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు తన సినీ జర్నీ స్టార్ట్ చేసారు. ఇవాళ్టికి కూడా పని పట్ల తనకున్న ఆసక్తి, ప్రేమ, నిబద్దత ఏమాత్రం తగ్గలేదు.. నాన్నా, ఈ రోజు మేము నీకున్న టాలెంట్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.. నీకోసం మరో 50 ఏళ్ళు ఏం రాసి పెట్టుందో తెలుసుకోవడానికి ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం.. ఉదయాన్నే విష్ చేద్దామని ఆయన రూమ్‌కెళ్ళాను.. రెడీ అవుతున్నారు.. ఇంత ఉదయాన్నే ఎక్కడికి అని అడిగితే, పని చెయ్యడానికి అని చెప్పారు.. అంటూ.. ఎమోషనల్‌గా పోస్ట్ చేసాడు అభిషేక్.. అమితాబ్ ప్రస్తుతం.. బద్లా, బ్రహ్మాస్త్ర సినిమాలు చేస్తున్నారు.