Mrunal Thakur : పదేళ్ల క్రితం చేసిన కామెంట్స్.. ఆ హీరోయిన్ ఫైర్ అవ్వడంతో సారీ చెప్పిన మృణాల్ ఠాకూర్..
పదేళ్ల క్రితం మృణాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

Mrunal Thakur
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన అందాలు ఆరబోస్తూ వైరల్ అవుతుంది. మృణాల్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా తన అందం, ఫిజిక్ గురించి కచ్చితంగా మాట్లాడుతుంది. ఒకప్పుడు తాను అందంగా లేనని, తన బాడీ బాగోలేదని తిరస్కరించారని అందుకే కసితో మంచి ఫిజిక్ తెచ్చుకొని అందంగా మారానని చెప్తూ ఉంటుంది.
అయితే ఎప్పుడో పదేళ్ల క్రితం మృణాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్ తో నువ్వు కండలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి ఇష్టపడతావా. ఆ విషయంలో బిపాసా బసు అలా కనిపిస్తుంది. నేను బిపాసా కంటే అందంగా అంటాను అని చెప్పింది. అప్పుడెప్పుడో కెరీర్ మొదట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవ్వడంతో బిపాసా కూడా ఈ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చింది.
Also Read : War 2 Collections : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు? ‘కూలీ’ కంటే తక్కువే..
బిపాసా మృణాల్ ఠాకూర్ కామెంట్స్ పై.. మహిళలు అందరూ దృడంగా, బలంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు శారీరికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అమ్మాయిలు బలంగా ఉండకూడదు అనేది పాతకాలపు ఆలోచనలు. అలాంటి ఆలోచనల నుంచి బయటకు రావాలి అని పోస్ట్ చేసింది. దీంతో బిపాసా మృణాల్ కి కౌంటర్ ఇచ్చిందంటూ బాలీవుడ్ మీడియా వైరల్ చేసింది. అయితే ఎప్పుడో పదేళ్ల క్రితం తెలిసి తెలియక మాట్లాడిన కామెంట్స్ కి బిపాసా ఇప్పుడు కౌంటర్ ఇవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
బిపాసా కామెంట్స్ వైరల్ అవ్వగా మృణాల్ ఠాకూర్ బిపాసాకు సారీ చెప్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. మృణాల్ తన పోస్ట్ లో.. 19 ఏళ్ళ వయసులో నేను తెలిసి తెలియక మాట్లాడాను. అప్పుడు మనం మాట్లాడే మాటలకు ఎంత విలువ ఉంటుంది అనేది నాకు తెలియదు. నేను ఎవరిని బాధపెట్టాలని అలా మాట్లాడలేదు. ఒకవేళ నా వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు. నేను ఎవరిని బాడీ షేమింగ్ చేయాలని అనుకోలేదు. అది ఎప్పటిదో పాత ఇంటర్వ్యూ ఇప్పుడు బయటకు వచ్చింది. నేను అలా మాట్లాడి ఉండకూడదు. ఏళ్ళు గడిచేకొద్దీ అసలైన అందం ఏంటో నాకు తెలిసింది. మనసుతో చూస్తే ప్రతి దానిలో అందం ఉంటుంది అని తెలిపింది. ఎప్పుడో పదేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూని ఇప్పుడు వైరల్ చేయడం ఏంటో దానికి ఇన్నేళ్లు స్పందించని బిపాసా స్పందించడం, దానికి మృణాల్ సారీ చెప్పడం మొత్తంగా ఈ వార్త అయితే వైరల్ గా మారింది.
Also Read : Coolie Collections : రజినీకాంత్ ‘కూలీ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు? వార్ 2 కంటే ఎంత ఎక్కువ?