War 2 Collections : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు? ‘కూలీ’ కంటే తక్కువే..

 ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2.

War 2 Collections : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు? ‘కూలీ’ కంటే తక్కువే..

War 2 Collections

Updated On : August 15, 2025 / 8:54 AM IST

War 2 Collections : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ సినిమా వార్ 2. నిన్న ఆగస్టు 14న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజయి మిక్స్ డ్ టాక్ తో వెళ్తుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటించడం, ఈ రేంజ్ స్పై యాక్షన్ సినిమాలో నటించడంతో టాలీవుడ్ లో అయితే మంచి హైప్ ఉంది. కానీ బాలీవుడ్ వాళ్లకు ఇది రొటీన్ స్పై యాక్షన్ సినిమానే.

వార్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో 25 కోట్ల గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది. ఇక మొదటి రోజు, అడ్వాన్స్ సేల్స్ కలుపుకొని వార్ 2 సినిమా హిందీలో 40 కోట్ల వరకు గ్రాస్, తెలుగులో 30 కోట్ల వరకు, తమిళ్ లో కోటి రూపాయలు, ఓవర్సీస్ లో 15 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు బాక్సాఫీస్ సమాచారం. అంటే ఆల్మోస్ట్ వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్, మొదటి రోజు కలుపుకొని 85 నుచి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Coolie Collections : రజినీకాంత్ ‘కూలీ’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు? వార్ 2 కంటే ఎంత ఎక్కువ?

ఇక నిన్న రజినీకాంత్ కూలీ సినిమా కూడా రిలీజయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భారీ హైప్ ఉండటంతో ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. కూలీ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చెప్తున్నారు. మరో మూడు రోజులు హాలిడేస్ కాబట్టి రెండు సినిమాల కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.