Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని డైలాగ్స్, మ్యానరిజమ్స్, సాంగ్స్ కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీలోని ‘శ్రీవల్లి’ సాంగ్ స్టెప్ గురించి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వైరల్ కామెంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అమితాబ్ హోస్ట్ గా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ రియాలిటీ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో సీజన్ 15 జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఒక ఎపిసోడ్ లో పుష్ప సినిమా గురించి ఒక ప్రశ్న ఎదురైంది. 2023లో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న నటుడు ఎవరు..? అని ప్రశ్నించగా.. కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని బదులిచ్చారు. అనంతరం అమితాబ్ పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. “పుష్ప సినిమా చూశారా, చాలా బాగుంటుంది. మూవీలోని సాంగ్స్ కూడా చాలా ఫేమస్” అంటూ చెప్పుకొచ్చారు.
Also read : Bharateeyudu 2 : విజయవాడలో ఇండియన్ 2 షూటింగ్.. రెండు భాగాలుగా సినిమా..
#AlluArjun
Sr. @SrBachchan Sir Praising Icon Star @alluarjun for #PushpaTheRiseThank You @SrBachchan Sir 💐🫶#AlluArjun #AmitabhBachchan #PushpaTheRule #PushpaTheRise #Pushpa2 pic.twitter.com/wELIhiqclN
— Allu Arjun fan ikkadaa (@AAFanIkkadaa) November 8, 2023
“ఆ సినిమాలోని ఒక సాంగ్ చెప్పు వదిలేసి వేసే స్టెప్పు ఉంటుంది. అది బాగా వైరల్ అయ్యింది. చెప్పు వదిలేసినా వైరల్ అవుతుందా..? అని చూడడం నా కెరీర్ లోనే మొదటిసారి” అంటూ వ్యాఖ్యానించారు. అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ ని అల్లు అర్జున్ అభిమానులు నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని సుకుమార్ మొదటి భాగాన్ని మించి తెరకెక్కిస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది ఆగష్టు ఆగష్టు 15న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది.