Anakapalli: అమ్మోరు దిగినాది.. పూనకాలు తెప్పించినాది.. ‘అనకాపల్లి’ మూవీ జాతర సాంగ్ వైరల్

అనకాపల్లి(Anakapalli) సినిమా నుంచి అమ్మోరు దిగినాది అనే జాతర సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

Ammoru Diginadi song from Anakapalli movie released

  • అదిరిపోయే విజువల్స్ తో జాతర సాంగ్.
  • అనకాపల్లి మూవీకి దేవాజండ్ అద్భుతమైన మ్యూజిక్
  • నెట్టింట వైరల్ అవుతున్న అమ్మోరు దిగినాది సాంగ్

Anakapalli: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అనకాపల్లి(Anakapalli)’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటిస్తున్న ఈ సినిమా రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, సినిమాపై అంచనాలు పెంచేసింది.

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. లోకేష్‌తో చేసేది తెలుగు సినిమా కాదా? డబ్బింగ్ సినిమానా?

తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ‘జాతర’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మంగ్లీ పవర్‌ఫుల్ గాత్రం, దేవజండ్ బాణీలు ఈ పాటకు ప్రాణం పోశాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో జాతర వాతావరణాన్ని తలపించేలా గ్రాండియర్‌గా చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. గణేష్ సలాది అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. కేవలం పాట మాత్రమే కాకుండా, ఈ విజువల్స్ సినిమాలోని రా అండ్ రస్టిక్ ఫీల్‌ను అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి.

మాస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ అంశాలతో పాటు, యువత మెచ్చే ప్రేమకథ, కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. వైవిధ్యమైన కథనంతో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకున్న ‘అనకాపల్లి’ త్వరలోనే థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.