Anand Deverakonda
Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. టవర్లో ఎపిక్, తక్షకుడు సినిమాలతో రాబోతున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ శ్రీ చిదంబరం గారు అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ సినిమా హీరో మెల్లకన్ను తో బాధపడే కథ.(Anand Deverakonda)
Also See : Avantika Vandanapu : అవంతిక వందనపు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. మూడు నెలల క్రితమే నేను ఈ సినిమా టీజర్ చూసాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వంశీ అసలు ఎలా చేసాడో. నేను నా రాబోయే సినిమా తక్షకుడులో బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఒక రెండు రోజులు చేయగానే నాకు తలనొప్పి వచ్చింది. నేనేం మెల్లకన్ను కూడా పెట్టట్లేదు కానీ ఎవరికీ ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, దానికే తలనొప్పి వచ్చింది.
మీ సినిమా టిజర్, ట్రైలర్ చూస్తూనే అందులోనే మీ పర్ఫార్మెన్స్ కనిపించింది. మీ ఫస్ట్ సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఈజీ కాదు. అదరగొట్టారు. ఇలాంటి పాత్ర చేసినందుకు మీరు గర్వపడొచ్చు అని అన్నారు. దీంతో తక్షకుడు సినిమా పూర్తయ్యే సరికి ఆనంద్ ఇంకెంత బాధపడతాడో తలనొప్పితో అని ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. అలాగే శ్రీ చిదంబరం గారు సినిమాలో హీరోగా చేసిన వంశీని అభినందిస్తున్నారు.