Anand Deverakonda : వైష్ణవి చైతన్యతో రిలేషన్ షిప్.. క్లారిటీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ..
ఆనంద్ - వైష్ణవి కలిసి చేసిన బేబీ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. (Anand Deverakonda)
anand Deverakonda
Anand Deverakonda : విజయ్ దేవరకొండ – రష్మిక లవ్ లో ఉన్నారు అని గీత గోవిందం తర్వాత నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఈ ఇద్దరూ స్పందించలేదు. తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అన్నారు. కట్ చేస్తే ఈ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చివరి వరకు సైలెంట్ గా ఉంచి పెళ్ళికి మూడు రోజుల ముందు ఈ విషయాన్ని ప్రకటించారు.
డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత వీరి మధ్య ప్రేమ పుట్టిందని తెలుస్తుంది. రెండు సినిమాలు కలిసి చేయడంతో వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే అప్పుడు అన్న విజయ్ పై రూమర్స్ వచ్చినట్టే ఇప్పుడు తమ్ముడు ఆనంద్ పై కూడా రూమర్స్ వస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్యతో రిలేషన్ లో ఉన్నాడని, వైష్ణవి దేవరకొండ చిన్న కోడలు అని రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also See : Thabitha Sukumar : భార్యతో సుకుమార్.. స్టైలిష్ 80s లుక్స్.. ఫోటోలు షేర్ చేసిన తబిత..
అందుకు కారణం లేకపోలేదు. ఆనంద్ – వైష్ణవి కలిసి చేసిన బేబీ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఆ సినిమాతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఎపిక్ సినిమాలో కూడా కలిసి నటించారు. ఎపిక్ లో వీరిద్దరి మధ్య ఘాటు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాతో ఆనంద్, వైష్ణవి మరింత క్లోజ్ అయ్యారు. దీంతో విజయ్ – రష్మిక లాగే ఆనంద్ – వైష్ణవి కూడా ప్రేమలో ఉన్నారు, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటారు అని సోషల్ మీడియాలో రీల్స్, మీమ్స్ వైరల్ చేసారు.
తాజాగా ఎపిక్ సినిమా ప్రమోషన్స్ లో ఆనంద్ దేవరకొండ దీనిపై స్పందిస్తూ.. అదేం లేదండి. కలిసి రెండు సినిమాలు చేసాం కాబట్టి మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఫ్రెండ్స్ అంతే. నాకు ఇంట్లో పెళ్లి ప్రెజర్ ఉంది కానీ నేను ఇప్పట్లో చేసుకోను. వైష్ణవి ఇంకా చిన్న పిల్లే. ఆమెకు 24 ఏళ్ళు ఉంటాయి అంతే. ఆమె కెరీర్ ఇప్పుడే మొదలు పెట్టింది. ఆమెకు ఇంకా పెద్ద కెరీర్ ఉంది. మేము కలిసి రెండు సినిమాలు చేయడం, అన్నయ్య – రష్మిక అలా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో మా మీద కూడా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే కానీ మా మధ్య ఏమి లేదు అని తెలిపాడు.
Also Read : Deverakonda Family : మూడు నెలలు దేవరకొండ ఫ్యామిలీవే.. ఫ్యాన్స్ కి భరోసా ఇచ్చిన విజయ్ దేవరకొండ..
మరి ప్రస్తుతానికి అయితే గతంలో విజయ్ చెప్పినట్టే ఇప్పుడు ఆనంద్ చెప్పాడు. మరి భవిష్యత్తులో ఏమైనా మారుతుందా లేక నిజంగానే ఆనంద్ – వైష్ణవి మధ్య ఏం లేదా అని చర్చ జరుగుతుంది.
