Ananya Nagalla: తనకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదంటూ వాపోయిన అనన్య

టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ళ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకుని, ఎవరూ ప్రపోజ్ చేయడం లేదని వాపోయింది.

Ananya Nagalla Says No One Is Proposing Her

Ananya Nagalla: టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చేసింది కొన్ని సినిమాలే అయినా, తనకంటూ మంచి గుర్తింపుతో పాటు క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ మల్లేశం, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఈ క్రమంలో తన సోషల్ అకౌంట్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేసింది ఈ బ్యూటీ.

Ananya Nagalla : టైట్ ఫిట్ గ్రీన్ డ్రెస్‌లో అనన్య నాగళ్ళ అందాలు..

ఈ క్రమంలోనే తన అభిమానులతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది ఈ హీరోయిన్. ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన అనన్యను ఓ అభిమాని ‘‘నీ బాయ్‌ఫ్రెండ్‌ పేరు, అతని ఇన్‌స్టా ఐడీ ఏమిటి’’ అని అడిగాడు. దీనికి సమాధానంగా ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. నాకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదు..’’ అంటూ వాపోయి ఈ బ్యూటీ.

Ananya Nagalla: అందాలను ప్రదర్శిస్తూ అనన్య నాగళ్ళ మళ్లీ వచ్చిందిగా..!

ఇలా తనకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదని అనన్య చెప్పడంతో అభిమానులు ఆమెకు ప్రపోజ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక నిత్యం హాట్ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న అనన్య, ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.