Anasuya Bharadwaj: ఆంటీ అన్నారో.. అంతే సంగతులు.. అనసూయ వార్నింగ్!
బుల్లితెరపై యాంకర్లుగా ఒక వెలిగిపోతున్న వారిలో అందాల ఆరబోతతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో ముందుగా ఉంటుంది అందాల భామ అనసూయ భరద్వాజ్. అనసూయకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో, అదే విధంగా ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. తనను ఆంటీ అంటూ పిలిచి, బాడీ షేమింగ్ చేస్తున్న వారందరికీ.. తన వ్యక్తిగత జీవితాన్ని ట్రోల్ చేస్తున్నవారు, తన ఫ్యామిలీని ఇందులోకి లాగుతున్నవారికి అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
- Anil Aaleti
- Updated on- August 26, 2022 / 05:15 PM IST
Anasuya Bharadwaj Fires On Netizens Calling Her Aunty
Anasuya Bharadwaj: బుల్లితెరపై యాంకర్లుగా ఒక వెలిగిపోతున్న వారిలో అందాల ఆరబోతతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో ముందుగా ఉంటుంది అందాల భామ అనసూయ భరద్వాజ్. పెళ్లి అయినా కూడా వన్నెతగ్గని అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. ఇక బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తన అందచందాలతో, అదిరిపోయే పర్ఫార్మెన్సులతో వరుస ఆఫర్లు కొట్టేస్తుంది.
Anasuya Bharadwaj : ‘ఆంటీ’ అంటావేంటి? నెటిజన్‌పై అనసూయ ఫైర్..
అయితే అనసూయకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉందో, అదే విధంగా ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అనసూయ వేసుకునే బట్టలు మొదలుకొని, ఆమె చెప్పే డైలాగులు, ఆమె ఫిజిక్‌పై నెట్టింట కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా అలాంటి వారందరినీ అనసూయ ఓ రేంజ్‌లో ఏసుకుంది. తనను ఆంటీ అంటూ పిలిచి, బాడీ షేమింగ్ చేస్తున్న వారందరికీ.. తన వ్యక్తిగత జీవితాన్ని ట్రోల్ చేస్తున్నవారు, తన ఫ్యామిలీని ఇందులోకి లాగుతున్నవారికి అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాను ప్రతిఒక్క ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ చేస్తున్నానని.. వారందరికీ త్వరలోనే షాకిచ్చేందుకు తాను రెడీగా ఉందంటూ ట్వీట్ చేసింది.
Anasuya: మధురవాణిగా మారుతున్న దాక్షాయణి..?
ఒక సెలబ్రిటీని ఈ విధంగా హేలన చేయడం ఏమాత్రం మంచిది కాదని.. తాను కూడా ఓ మనిషినేనని.. తనకు కూడా వ్యక్తిగత జీవితం ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ఇలా సోషల్ మీడియాలో తనపై ఆంటీ అంటూ ట్రోలింగ్ చేస్తున్నవారందరికీ తాను ఇదే చివరి హెచ్చరిక ఇస్తున్నట్లుగా అనసూయ ట్వీట్ చేసింది. అయితే లైగర్ చిత్రాన్ని ఉద్దేశించి అనసూయ ఓ ఇండైరెక్ట్ ట్వీట్ ఈ దుమారినికి కారణమని పలువురు అంటున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
