Anasuya Bharadwaj : ‘ఆంటీ’ అంటావేంటి? నెటిజన్‌పై అనసూయ ఫైర్..
తనను ఆంటీ అని పిలిచినందుకు ఓ నెటిజన్ మీద విరుచుకుపడింది పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్..
- sekhar
- Published On : January 18, 2022 / 04:16 PM IST
Anasuya
Anasuya Bharadwaj: తనను ఆంటీ అని పిలిచినందుకు ఓ నెటిజన్ మీద విరుచుకుపడింది పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్. టీవీ ప్రోగ్రామ్స్, సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ.
Balakrishna : బాలయ్య ‘మంగళవారం మెనూ’ మామూలుగా లేదుగా!
రీసెంట్‌గా సంక్రాంతికి భర్తతో కలిసి కైట్స్ ఎగరేస్తూ ఆ ఫొటోలతో సందడి చేసింది. అనసూయ నెటిజన్లతో చిట్ చాట్ చేసిన ప్రతిసారీ ఎవరో ఒకరికి క్లాస్ పీకుతుంటుంది. ఇప్పుడు కూడా చిట్ చాట్‌లో ఓ వ్యక్తికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చి వార్తల్లో నిలిచింది.
RajiniKanth : ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. రజినీ ధైర్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పోస్టులు
వివరాళ్లోకి వెళ్తే.. చిట్ చాట్‌లో అనసూయని ఓ నెటిజన్.. ‘మిమ్మల్ని అక్కా అని పిలవాలా.. లేక ఆంటీ అని పిలవాలా?’ అని అడిగాడు. అంతే అనసూయకి కోపం వచ్చేసింది. ‘నన్ను ఎలాగూ పిలవొద్దు.. నేనెవరో నీకు అంతగా తెలియనప్పుడు అక్క, ఆంటీ అని పిలవడానికి నువ్వెవరు?.. అలా పిలిస్తే ఏజ్ షేమింగ్ వస్తుంది.. అప్పుడు నేను నిన్నుపెంచిన వారినే అనాల్సి వస్తుంది’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Bro Daddy : ట్రైలర్ అదిరింది.. ఓటీటీలో మోహన్ లాల్ మూవీ..
కట్ చేస్తే.. అనసూయ ఆన్సర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ‘అక్క, ఆంటీ అని పిలవడంలో తప్పేముంది. అలా పిలిచినంత మాత్రాన అవమానిచడం ఎలా అవుతుంది?’.. అంటూ అనసూయ మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Sreeja : భర్త పేరు తీసేసిన చిరంజీవి కూతురు.. సమంతని ఫాలో అవుతుందా??
