Anasuya Bharadwaj : ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఫ్లోలో ఏజ్ చెప్పేసిన అనసూయ.. వీడియో వైరల్
అందాల భామలు తమ వయసు చెప్పాల్సి వస్తే మాట దాటేస్తుంటారు. అయితే అనసూయ ప్రెస్ మీట్ లో సీరియస్ గా ఒక విషయం గురించి మాట్లాడుతూ..
- gum 95921
- Published On : October 11, 2023 / 08:01 PM IST
Anasuya Bharadwaj said her age infront of media video gone viral
Anasuya Bharadwaj : టాలీవుడ్ లో యాంకర్ గా మంచి ఫేమ్ ని సంపాదించుకున్న అనసూయ.. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీ అయ్యిపోతుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మ అత్తగా తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని ఇతర ఫిలిం మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. దీంతో చిన్న పెద్దా సినిమాల్లో ముఖ్య పాత్రలు ఈ అమ్మడి సరసన చేరుతున్నాయి. ప్రస్తుతం రజాకార్ అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తుంది. రీసెంట్ గా ఈ మూవీ టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ మాట్లాడుతూ తన ఏజ్ ఎంతో బయటి పెట్టేసింది. అందాల భామలు తమ వయసు చెప్పాల్సి వస్తే మాట దాటేస్తుంటారు. అయితే అనసూయ ప్రెస్ మీట్ లో సీరియస్ గా ఒక విషయం గురించి మాట్లాడుతూ.. “38 ఏళ్ళు వచ్చాయి నాకు” అంటూ మాట్లాడేసింది. ఇక ఈ మాటలు విన్న విలేకర్లు.. ‘మీరు ఫ్లోలో మీ ఏజ్ చెప్పేశారు’ అని చెప్పడంతో.. అనసూయ నవ్వుతూ సిగ్గుపడింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Siddharth : బిగ్‌బాస్ హౌస్‌లోకి హీరో సిద్దార్థ్.. ఏదో జరుగుతుంది అంటున్న ఆడియన్స్..
రజాకార్ మూవీ విషయానికి వస్తే.. 19వ కాలంలో తెలంగాణలో రజాకార్ల ఉద్యమం జరిగేది. ఆ సమయంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలు, చేసిన పోరాటాలను ఈ సినిమా ద్వారా ఇప్పటి వారికీ తెలియజేయనున్నారు. యాట సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్ రిలీజ్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. రెండిటికి మంచి స్పందన వచ్చింది.
