Anasuya Bharadwaj: ఆ రాత్రి వెక్కి వెక్కి ఏడ్చాను.. మూడు సినిమాలు నుంచి తీసేశారు.. రీజన్ కూడా చెప్పలేదు
తనపై వస్తున్న ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj).
- V Santhosh Kumar
- Published on- May 22, 2026 / 09:41 AM IST
Anasuya Bharadwaj shocking comments about the trolling directed at her
- మూడు సినిమాల నుండి అనసూయ అవుట్.
- అర్ధరాత్రి భర్త ముందు ఏడ్చేశాను.
- డ్రింకింగ్ ట్రోల్స్‌కు గట్టి కౌంటర్.
Anasuya Bharadwaj: బుల్లితెరపై యాంకర్‌గా రచ్చ లేపి, ఇప్పుడు వెండితెరపై మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా దూసుకుపోతోంది అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). ‘క్షణం’, ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలతో నటిగా ఎంట్రీ ఇచ్చి, ‘రంగస్థలం’లో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టి కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అయితే, సక్సెస్‌తో పాటు లైఫ్‌లో తాను ఫేస్ చేసిన కొన్ని షాకింగ్ రిజెక్షన్స్, హర్టింగ్ మూమెంట్స్‌ను తాజాగా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు అనసూయ.
Rashmi Gautam: నడుమందాలతో.. ఎద ఒంపులతో.. హాఫ్ శారీలో గ్లామర్ రచ్చ చేస్తున్న రష్మీ
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె మట్లాడుతూ.. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు తనను లాక్ చేశారని, దానికి ఎలాంటి రీజన్ చెప్పకుండా లాస్ట్ మినిట్‌లో ఆ సినిమాల నుండి తొలగించారని అనసూయ వెల్లడించింది. “ఆ నైట్ నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. అర్ధరాత్రి 2 గంటల టైమ్‌లో మా హస్బెండ్‌ను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాను” అంటూ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.
అదే సమయంలో.. ట్రోలింగ్, పర్సనల్ లైఫ్‌పై వచ్చే రూమర్స్‌కు అస్సలు భయపడనని అనసూయ క్లారిటీ ఇచ్చింది. “నేను అప్పుడప్పుడు లిమిటెడ్‌గా డ్రింక్ చేస్తాను. దాన్నే పెద్ద ఇష్యూ చేసి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు ఇలాంటి నెగెటివిటీని హ్యాండిల్ చేయడం నాకు అలవాటైపోయింది. ఎవరు ఏమనుకున్నా నా వర్క్ నేను చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్తాను” అంటూ ఫైర్‌బ్రాండ్‌లా నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
