Anasuya enjoying in America photos goes viral
Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉందని తెలిసిందే. వరుస సినిమా ఆఫర్స్ వస్తుండటంతో యాంకర్ అవకాశాలు కూడా వదులుకుంది. ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క ఈవెంట్స్ తో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ హడావిడి గురించి చెప్పనవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఇటీవల ఆ బోల్డ్ నెస్ మరింత పెరిగింది. కొన్ని రోజుల క్రితమే థాయ్‌లాండ్ బీచ్‌లో బికినీతో ఫోటోలు పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది అనసూయ.
ఇటీవల అనసూయ అమెరికాలో ఓ ఈవెంట్ కి వెళ్ళింది. అలాగే అక్కడే కొన్ని రోజులు ట్రిప్ కూడా వేసి రావడానికి ఫిక్స్ అయిపోయింది. దీంతో అనసూయ ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటికే అమెరికా ట్రిప్ నుంచి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. తాజాగా వాషింగ్‌టన్‌లో రోడ్డు మధ్యలో నిలబడి హాట్ ఫోజులతో ఫోటోలని పోస్ట్ చేసింది. షార్ట్ టీ షర్ట్, షార్ట్ నిక్కర్ వేసుకొని నడుము కనిపించేలా చేతులు రెండూ పైకెత్తి హాట్ పోజుతో ఫోటోలు దిగింది.
ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనసూయ. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అనసూయ అమెరికాలో మాములుగా ఎంజాయ్ చేయట్లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.