Anasuya : ఏడుస్తున్న వీడియోని షేర్ చేసిన అనసూయ.. ఆనందంతో పాటు బాధ కుడా జీవితంలో భాగమే..

తాజాగా మరోసారి అనసూయ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సారి ఓ ఏడుస్తున్న వీడియోని షేర్ చేసింది అనసూయ. ఈ వీడియోలో అనసూయ గుక్కపెట్టి ఏడుస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసి చాలా పెద్ద మ్యాటర్ రాసింది.

Anasuya Shares her Crying Video in Social Media its goes Viral

Anasuya :  యాంకర్ అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కి గ్యాప్ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది అనసూయ. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పెట్టి హడావిడి చేస్తుంది. సోషల్ మీడియాలో ఎవరో ఒకరి మీద కౌంటర్లు వేస్తూ, ట్వీట్స్ చేస్తూ, తనపై విమర్శలు చేసేవాళ్ళకి సమాధానాలు చెప్తూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంది.

తాజాగా మరోసారి అనసూయ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సారి ఓ ఏడుస్తున్న వీడియోని షేర్ చేసింది అనసూయ. ఈ వీడియోలో అనసూయ గుక్కపెట్టి ఏడుస్తుంది. ఈ వీడియో పోస్ట్ చేసి చాలా పెద్ద మ్యాటర్ రాసింది.

అనసూయ ఏడుస్తున్న వీడియోని షేర్ చేసి.. మీ అందరూ బానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈ పోస్ట్ చూసి మీరు కంగారు పడతారు. సోషల్ మీడియా అనేది సమాచారాన్ని పంచుకునేందుకు, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి అని నా అభిప్రాయం. కానీ సోషల్ మీడియాలో జరిగేది వేరు. ఈ పోస్ట్ ఎందుకు చేశానంటే నేను ఏ ఫోటోషూట్ చేసినా, ఫోటోలు, వీడియోలు, నవ్వులు.. అన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా బాధని కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్ లో బాధాకరమైన రోజులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ ఒకసారి పడ్డాక మళ్ళీ లేచి వస్తాను. మనం నమ్ముతున్న విషయాలపై నెగిటివ్ ఎదురైనా బాగా ఏడ్చి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ గట్టిగా ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. గ్యాప్ తీసుకోండి కానీ వదిలేయొద్దు, మళ్ళీ మొదలుపెట్టండి అని పోస్ట్ చేసింది.

Brahmanandam Daughter in Law : బ్రహ్మానందం రెండో తనయుడి పెళ్లి.. కోడలు ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?

అలాగే ఇది అయిదు రోజుల క్రితం వీడియో అని, ఏడ్చేటప్పుడు అలా రికార్డ్ చేసి ఉంచుకున్నాను అని, ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను అని తెలిపింది అనసూయ. దీంతో అనసూయ వీడియో వైరల్ గా మారింది. అయితే దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది మీరు ఏడవకండి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇప్పుడు మళ్ళీ ఎవర్ని గెలికావు, ఎవరు ఏమన్నారు అని కామెంట్స్ చేస్తుంటే పలువురు ఇదంతా పబ్లిసిటీ స్టంట్, ఇలా ఏడ్చే వీడియో ఎవరూ పెట్టారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి అనసూయ ఈ ఏడ్చే వీడియో ఎందుకు పెట్టిందో కానీ మరోసారి అనసూయ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.