Anasuya: అనసూయ వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు జనార్దన్ అరెస్ట్!
అనసూయ(Anasuya)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్.
- V Santhosh Kumar
- Published On : March 14, 2026 / 07:27 AM IST
Anasuya social media harassment janardhan arrest
Anasuya: టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల వ్యవహారంలో పోలీసులు కీలక చర్య తీసుకున్నారు. ఆమెపై అసభ్యకర పోస్టులు పెడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న జనార్దన్ అనే వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం వ్యూస్, ఫాలోయింగ్ పెంచుకోవాలనే స్వార్థంతోనే నిందితుడు ఈ వికృత చేష్టలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
అనసూయ(Anasuya) ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేయడం, అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ ఆమె ప్రతిష్టకు భంగం కలిగించడం వంటి పనులను జనార్దన్ నిరంతరం చేస్తూ ఉండే వాడు. తనపై జరుగుతున్న ఈ డిజిటల్ దాడిని తీవ్రంగా పరిగణించిన అనసూయ, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు విచారణ చేపట్టగా కేవలం ఆన్‌లైన్ రీచ్ లక్ష్యంగా ఇలాంటి పనులు చేస్తున్నట్టుగా నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
