Anasuya : మళ్లీ ట్విట్టర్ లో రచ్చ మొదలుపెట్టిన అనసూయ.. రౌడీ హీరోని టార్గెట్ చేసి ట్వీట్.. ఆడుకుంటున్న నెటిజన్లు..
ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే తాజాగా విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నిన్న రాత్రి నుంచి నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటున్నాడు.
- Saketh U
- Updated on- May 6, 2023 / 06:57 AM IST
Anasuya tweet goes viral netizens trolling on Anasuya
Anasuya : కొన్ని రోజుల క్రితం అనసూయని(Anasuya) ఆంటీ అన్నారని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. ఇలాగే ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో, కామెంట్స్ తో సినిమాలు, షోల కంటే కూడా ఈ మధ్య సోషల్ మీడియాలోనే(Social Media) బాగా హైలెట్ అవుతుంది అనసూయ. అసలు సంబంధం లేకుండా సడెన్ గా ఏదో ఒక పోస్ట్ వేసి ఓ రోజంతా రచ్చ చేస్తుంది. దీంతో నెటిజన్లు అనసూయని దారుణంగా ఆడుకుంటారు. ఎలాంటి సంఘటన, ఎలాంటి సంబంధం లేకుండానే తాజాగా విజయ్ దేవరకొండని(Vijay Devarakonda) టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది అనసూయ. దీంతో నిన్న రాత్రి నుంచి నెటిజన్లు అనసూయని ఆడేసుకుంటున్నాడు.
విజయదేవరకొండ, సమంత సినిమా ఖుషి నుంచి త్వరలో ఓ సాంగ్ రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో The Vijaya Devarakonda అని పేరు వేశారు పోస్టర్ మీద. దీంతో అనసూయ ఈ పోస్టర్ ని, విజయ్ దేవరకొండని ఉద్దేశిస్తూ ఇప్పుడే ఒకటి చూశాను.. The నా? బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం అంటకుండా చూసుకుందాం అని ట్వీట్ చేసింది. దీంతో విజయ్ అభిమానులు, నెటిజన్లు పేరు ముందు The పెట్టుకుంటే కూడా తప్పేనా అంటూ మరోసారి అనసూయ మీద విరుచుకుపడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. మరోసారి ఆంటీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
Naga Chaitanya : సమంత మంచి అమ్మాయి.. ఆమె సంతోషంగానే ఉండాలి.. నాగచైతన్య కామెంట్స్!
మళ్లీ అనసూయ ఇంకో ట్వీట్ వేసి మరింత రెచ్చగొట్టింది. ఈ సారి.. భలే రియాక్ట్ అవుతున్నారు దొంగ.. ఊప్స్.. బంగారు కొండలంట. ఎక్కడో అక్కడ నేను నిజం అని ప్రూవ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు అని ట్వీట్ చేసింది. దీంతో అనసూయని అసలు అనవసరం లేకుండా ఎందుకు ట్వీట్స్ వేస్తారో, ఎందుకు ఇలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుందో అని అందరూ ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇక కొంతమంది ప్రతిసారి ఈమె అంతే అటెన్షన్ కోసం ఇలా చేస్తుంది వదిలేయండి అని ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ఖాళీగా ఔన్నప్పుడు టైం పాస్ కోసం ఇలా సోషల్ మీడియాలో అందర్నీ రెచ్చగొడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి ఎప్పటిలాగే అనసూయ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.
