Geetha Bhagat : కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయబోతున్న యాంకర్ గీతా భగత్.. టాలీవుడ్ కోసం..

ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ తో మెప్పిస్తున్న గీతా భగత్ ఇటీవల నిర్మాతగా మారి ఈటీవీ విన్ లో పలు చిన్న సినిమాలను నిర్మిస్తుంది. (Geetha Bhagat)

  • Published on- May 3, 2026 / 07:51 PM IST

Geetha Bhagat

Geetha Bhagat : టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో బిజీగా ఉండే స్టార్ యాంకర్స్ లో గీతా భగత్ ఒకరు. యాంకర్ సుమ తర్వాత ఆ రేంజ్ లో వాక్చాతుర్యంతో, మంచి డ్రెస్సింగ్ తో అందర్నీ మెప్పించే యాంకర్ గీతా భగత్. ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ తో మెప్పిస్తున్న గీతా భగత్ ఇటీవల నిర్మాతగా మారి ఈటీవీ విన్ లో పలు చిన్న సినిమాలను నిర్మిస్తుంది.

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొత్తవాళ్లను ప్రోత్సహించడం కోసం క్యాస్టింగ్ ఏజెన్సీ కూడా మొదలుపెట్టింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండి, సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గీతా భగత్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఆరెంజ్ కాస్టింగ్’ పేరుతో ఒక కాస్టింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Read : Meghana Raj : చనిపోయిన హీరో కలని తీర్చిన భార్య.. రజినీకాంత్ తో ఫొటోలు షేర్ చేసి..

తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘ఆరెంజ్ కాస్టింగ్’ లోగోను షేర్ చేస్తూ.. మంచి విషయాలను అనౌన్స్ చేయడానికి కాస్త లేట్ అయినా పర్వాలేదు. ఆరెంజ్ కాస్టింగ్ ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మా ఈ ప్రయాణం ఎప్పుడో మొదలైంది. కొత్త ముఖాలను, టాలెంట్‌ను వెతికి పట్టుకుని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో వాళ్లకు అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, భవిష్యత్తులో మరిన్ని అదిరిపోయే అప్‌డేట్స్ రాబోతున్నాయి అని తెలిపారు.

త్వరలోనే కొత్త నటీనటులు, ఆసక్తి ఉన్నవారు ఈ ఆరెంజ్ క్యాస్టింగ్ కి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది ప్రకటిస్తారని సమాచారం. ఓ పక్క యాంకర్ గా చేస్తూనే మరో పక్క నిర్మాతగా మారి, ఇప్పుడు క్యాస్టింగ్ ఏజెంట్ గా కూడా మారబోతుంది గీతా భగత్.

Also Read : Lathish : విలన్ గా నటించడం కోసం ఏకంగా 30 కిలోలు బరువు పెరిగి.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు..