Anil Ravipudi : కింగ్ నాగార్జున – అనిల్ రావిపూడి.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాంబో ఫిక్స్..
తాజాగా అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమాపై కామెంట్స్ చేసారు. (Anil Ravipudi)
- Saketh U
- Published on- June 14, 2026 / 08:50 PM IST
Anil Ravipudi
Anil Ravipudi : అనిల్ రావిపూడి.. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు. సీనియర్ స్టార్ హీరోలు, యువ హీరోలతోనూ సినిమాలు చేస్తున్నాడు. నిన్నటి తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో అనిల్ రావిపూడి సినిమాలు చేసి సక్సెస్ లు కొట్టారు. దీంతో నాగార్జునతో కూడా సినిమా చేసేస్తే అప్పటి తరం నలుగురు హీరోలతో సినిమా చేసిన ఈ తరం దర్శకుడిగా అనిల్ రావిపూడి సరికొత్త రికార్డ్ కొడతాడు.
దీంతో అనిల్ రావిపూడి – నాగార్జున సినిమా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. గతంలో వార్తలు వచ్చినా అవి రూమర్స్ అని తేలిపోయింది. తాజాగా అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమాపై కామెంట్స్ చేసారు.
Also Read : Vijay Rashmika : విజయ్ – రష్మిక లేటెస్ట్ క్యూట్ ఫొటోలు చూశారా..? దేవరకొండ సొంతూళ్లో సందడి..
ఓ షో ప్రమోషన్స్ లో భాగంగా సీనియర్ నటి రాధ మాట్లాడుతూ.. నేను చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేశాను అంటే అనిల్ రావిపూడి చిరు, బాలయ్య, వెంకటేష్ లతో చేసిన సినిమా పేర్లు చెప్పి.. నాగార్జునతో మనం త్వరలో తీయబోతున్నాం అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నారు. నాగార్జున తన వందో సినిమా ఓ తమిళ దర్శకుడితో చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అయ్యాక నాగార్జున – అనిల్ రావిపూడి కాంబో ఉంటుందని తెలుస్తుంది. నాగార్జున 101 వ సినిమా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడని, 2028 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తారని భావిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చేస్తే అనిల్ రావిపూడి నలుగురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ కొట్టిన దర్శకుడిగా సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం.
Nagarjuna garu…Soggade chinni nayana
#AnilRavipudi ~ Twarlo manam oka cinema cheyali Nagarjuna Garitho 🔥#King101 – #NAGxANIL Locked 🔐🔥#KingNagarjuna #AkkineniFans pic.twitter.com/TGg5uKuNol— KING SIDDHARDH 🦇 (@_SIDDHARDH_) June 14, 2026
