Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్.. ఎవరు? సినిమా ఓపెనింగ్ ఎప్పుడంటే..?

అనిల్ రావిపూడి వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ ప్రకట్టించాడు.(Anil Ravipudi)

  • Published on- June 17, 2026 / 08:37 AM IST

Anil Ravipudi

Anil Ravipudi : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సంవత్సరం సంక్రాంతికి చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు అంటూ వచ్చి ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ ప్రకట్టించాడు.

ఇటీవల ఈ సినిమా అప్డేట్ గురించి ఓ ఈవెంట్లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. జూన్ 18 ఈ సినిమా ఓపెనింగ్ జరుగుతుందని, జూన్ 22 నుంచి షూటింగ్ మొదలవుతుందని, సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

Also Read : Samantha : నాగ చైతన్యతో చేసిన సినిమా.. అది లేకపోతే ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు.. సమంత వ్యాఖ్యలు..

ఈ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకుంటాను అని అనిల్ రావిపూడి LIK సినిమా ఈవెంట్లో ప్రకటించాడు. దీంతో కళ్యాణ్ రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ అని సమాచారం. తాజాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. కీర్తికి ఆల్రెడీ అనిల్ రావిపూడి కథ చెప్పి ఒప్పించాడని సమాచారం. దీంతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాలో కీర్తి సురేష్ – కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించబోతున్నారు అని తెలుస్తుంది. రేపు సినిమా ఓపెనింగ్ తో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.