Anil Ravipudi : అనిల్ రావిపూడి రెడీ.. వెంకీమామ, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..

అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా వెంకటేష్ - కళ్యాణ్ రామ్ లతో అని ఆల్రెడీ ప్రకటించాడు. (Anil Ravipudi)

  • Published on- June 9, 2026 / 05:42 PM IST

Anil Ravipudi

Anil Ravipudi : వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకులలో అనిల్ రావిపూడి ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి పండగలకు తన సినిమాలను రిలీజ్ చేస్తూ హిట్స్ కొడుతూ టాలీవుడ్ ని అప్పుడప్పుడు నష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాడు తన సినిమాల కలెక్షన్స్ తో. ఇటీవల సంక్రాంతికి చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అనిల్.

అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో అని ఆల్రెడీ ప్రకటించాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని కూడా చెప్పేసాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని వెంకీ ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు అనిల్.

Also Read : Nayanthara : పెళ్లి రోజు.. భర్త, పిల్లలతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన నయనతార..

తాజాగా ఓ సినిమా ఈవెంట్ కి హాజరయిన అనిల్.. వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమా జూన్ 18న ఓపెనింగ్ పూజా కార్యక్రమం జరుపుకుంటుంది. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అని తెలిపారు. దీంతో ఈ సినిమా ఓపెనింగ్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. అనిల్ రావిపూడి కూడా పూరి జగన్నాధ్ లాగే ఫాస్ట్ గా షూట్ చేసి సినిమాని ఫాస్ట్ గా రెడీ చేస్తాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ మొత్తం అయిపోయింది. జూన్ 22 షూటింగ్ మొదలుపెట్టి ఆరు నెలల్లో సినిమా రెడీ చేసి 2027 సంక్రాంతికి రిలీజ్ చేసి మరో హిట్ కొట్టే ప్లాన్ లో ఉన్నాడు అనిల్ రావిపూడి.