Anirudh : ఓ పక్క త్వరలో పెళ్లి.. మరో పక్క పాన్ ఇండియా బిజీ..

ఓ పక్కన పెళ్లి చేసుకోబోతూ మరో పక్క పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. (Anirudh)

  • Published on- October 17, 2026 / 08:18 PM IST

Anirudh

Anirudh : పాటలతో మాయ చేస్తాడు.. బీజీఎంతో మోత మోగించేస్తాడు.. కటౌట్‌ పరంగా బక్కోడే కానీ.. బీట్స్‌ మాత్రం బలమైన ఇంపాక్ట్ చూపిస్తాయి అని అందరూ మాట్లాడుకునే ట్రూ రాక్‌స్టార్ అనిరుధ్‌ రవిచందర్‌. రీసెంట్ గానే అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో మరోసారి అనిరుధ్ వార్తల్లో నిలిచాడు. ఓ పక్కన పెళ్లి చేసుకోబోతూ మరో పక్క పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

సాయి అభ్యంకర్‌ లాంటి యంగ్ మ్యూజిక్‌ సెన్సేషన్స్‌, సీనియర్ సంగీత దర్శకులు తనకి పోటీగా ఇండస్ట్రీలో రాణిస్తున్నా అనిరుధ్ బీట్‌కి ఏ మాత్రం పవర్‌ తగ్గలేదంటున్నారు అభిమానులు. జైలర్ 2 మ్యూజికల్‌ ఆల్బమ్‌ ఊహించినంత రేంజ్‌లో లేదనే కామెంట్స్‌కి థియేటర్స్‌లో బ్లాక్‌బాస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ డెలివర్‌ చేసి ప్రేక్షకుల నుంచి యునానిమస్‌ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాడు అనిరుధ్‌ రవిచందర్.

Also Read : Vijay Deverakonda : విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న విజయ్, రష్మిక.. ఫొటోలు..

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ జైలర్ 2కి బ్లాక్‌బాస్టర్‌ మ్యూజిక్‌ అందించిన అనిరుధ్‌ చేతిలో ప్రస్టేజియస్‌ సినిమాలున్నాయి. కమల్‌ హాసన్‌ ప్రొడ్యూస్‌ చేస్తోన్న ధర్మన్‌ సినిమాతో పాటు కమల్‌ హాసన్‌-రజనీకాంత్‌ మల్టీస్టారర్‌కి కూడా అనిరుధే మ్యూజిక్‌ డైరెక్టర్‌. అంతేకాదు శింబు హీరోగా తెరకెక్కుతోన్న అరసన్ సహా.. రీసెంట్‌గా డైరెక్టర్‌ శంకర్‌ అనౌన్స్‌ చేసిన భారతీయుడు 3కి కూడా ఈ బక్కోడే ట్యూన్స్ కంపోజ్‌ చేస్తున్నాడు. కేవలం కోలీవుడ్ సినిమాలకే కాదు నార్త్‌లో ఇప్పటికే జవాన్‌తో బోణీ కొట్టిన అనిరుధ్‌ కింగ్‌తో హవా చూపించేందుకు రెడీ అవుతున్నారు.

టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కే సినిమాలకి అనిరుధ్ నే కంపోజర్‌గా తీసుకుంటున్నారు. అల్లు అర్జున్‌-లోకేశ్‌ కనగరాజ్‌ AA23, NTR,త్రివిక్రమ్ గాడ్‌ ఆఫ్‌ వార్ సహా త్వరలో సెట్స్‌ పైకి వెళ్లే రామ్‌ చరణ్‌-సుకుమార్‌ RC17 ప్రాజెక్ట్‌కి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అనిరుధ్‌ పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్‌ వారసుల సినిమాలకి మాత్రమే కాదు. బాలయ్య-కొరటాల సినిమాకి కూడా అనిరుధే స్వరాలు ఇస్తున్నారు. అలాగే MS సుబ్బలక్ష్మి బయోపిక్‌గా రష్మిక నటించే MS ఏ లెగసీ ఆన్‌ స్క్రీన్‌ ప్రాజెక్ట్‌కి అనిరుదే కంపోజర్‌. మరి ఈ ప్రస్టేజియస్‌ సినిమాలతో ఈ బక్కోడు ఏ రేంజ్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తాడో చూడాలి. సౌత్‌ టు నార్త్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న అనిరుధ్‌ ప్రస్తుతం తన మ్యూజిక్ తో పాన్‌ ఇండియాని రూల్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్లి న్యూస్ ప్రకటించి మరింత వైరల్ అవుతున్నాడు.

Also Read : Bigg Boss Today Promo : షాలినికి ఇచ్చి పడేసిన నాగార్జున.. ఏడుపు ఒక్కటే తక్కువ.. ప్రోమో వైరల్.. ఎలిమినేట్ అవుతుందా?