Missing Meghana : సెప్టెంబర్ 18న వస్తున్న మిస్సింగ్ మేఘన.. ప్రీ రిలీజ్ ఈవెంట్..
మిస్సింగ్ మేఘన సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. (Missing Meghana)
- Saketh U
- Published on- September 16, 2026 / 11:28 AM IST
Missing Meghana
Missing Meghana : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా మిస్సింగ్ మేఘన. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో వాచస్పతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. మిస్సింగ్ మేఘన సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి విన్నప్పుడు సంగీతం అందించడం కొంచం కొత్తగా అనిపించింది. సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అని అన్నారు. నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా నేను చూసాను. చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. సినిమాకు సపోర్ట్ చేయాలని అనిపించింది అని అన్నారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. ఈ సినిమా బాగా రావడానికి కారణం కథ. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న మూవీ యూనిట్ అందరికీ థాంక్స్ అని అన్నారు. నటుడు రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. నేను గతంలో సినిమా చేయడం మిస్ అయిన అందరితో కలిసి ఈ సినిమాలో పని చేశారు. అమ్ము అభిరామి తో ఇది నా రెండవ సినిమా అని అన్నారు. నటుడు అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. సంవత్సరం తర్వాత మీడియా ముందుకు రావడం ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఉండటానికి కారణం దర్శకుడు వాచస్పతి. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశారు అని అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేను సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం రామ్ కార్తీక్. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లు నాతో గతంలో పని చేశారు. నిర్మాతకు కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం, సినిమా విడుదల తేది వరకు గట్టిగా నిలబడాలి. సినిమా అంటే డబ్బు కాదు, కొంత మంది జీవితం. చిన్న సినిమాలకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
