Chiranjeevi-Harish Shankar : హరీశ్‌తో మెగాస్టార్ మరో రీమేక్..?
రీమేక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీశ్ శంకర్.. మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నాడా?
![Chiranjeevi-Harish Shankar : హరీశ్‌తో మెగాస్టార్ మరో రీమేక్..? Chiranjeevi-Harish Shankar : హరీశ్‌తో మెగాస్టార్ మరో రీమేక్..?](https://10tv.in/wp-content/uploads/2024/08/Another-remake-of-Megastar-Chiranjeevi-with-Harish-Shankar.jpg)
Chiranjeevi-Harish Shankar
Chiranjeevi-Harish Shankar : రీమేక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరీశ్ శంకర్.. మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నాడా? ప్రస్తుతం టాలీవుడ్లో షికారు చేస్తున్న ఊహాగానాల ప్రకారం ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా హరీశ్ శంకర్‌తో మెగాస్టార్ సినిమాపై ప్రకటన ఉండబోతోందట. దాదాపు రీమేక్ చిత్రాలే తీస్తున్న హరీశ్ శంకర్.. చిరంజీవితో చేసే సినిమా కూడా రీమేకేనని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు హరీశ్ శంకర్. ఇది తమిళ్ లో హిట్టయిన తేరి రీమేక్ అనే టాక్ ఉంది.
ఈ సినిమా రీమేక్‌పై పవన్ ఫ్యాన్స్ నుంచి ఎంతలా వ్యతిరేకత వచ్చినా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఐతే పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌కి బ్రేక్ వచ్చింది. దీంతో అన్నయ్య చిరంజీవితో సినిమాకు ప్లాన్ చేశాడట హరీశ్ శంకర్.
Mahesh Babu : ఫలితంతో సంబంధం లేదు.. మీరు నిజమైన ఛాంపియన్ : మహేశ్ బాబు ట్వీట్..
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చిరు పెద్ద కుమార్తె సుష్మిత మరో నిర్మాతగా ఓ రీమేక్ చిత్రానికి హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తమిళంలో బాగా హిట్ అయిన ఓ సినిమాను చిరంజీవితో చేయాలని హరీశ్ సిద్ధమయ్యారట. కాకపోతే స్టోరీలో భారీ మార్పులు చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాకు రచయిత బివిఎస్ రవి వర్క్ చేస్తున్నాడంటున్నారు. చిరంజీవి బర్త్ డే నాడు ఈ సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు.
అయితే చిరు ఇప్పటికే వేదాళం అనే తమిళ సినిమాను తెలుగులో భోళా శంకర్‌గా రీమేక్ చేసి భారీ డిజాస్టార్ మూటగట్టుకున్నాడు. ఇక మరోసారి ఏ రీమేక్ వద్దని ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నా హరీశ్‌తో సినిమాకు ఓకే చేయడమే చర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ సినిమాపై హరీశ్ శంకర్ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సివుందంటున్నారు.
Mr Bachchan Trailer : ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్.. మాస్ మహారాజా ఈజ్ బ్యాక్..!