Mahesh Babu : ఫ‌లితంతో సంబంధం లేదు.. మీరు నిజ‌మైన ఛాంపియ‌న్ : మ‌హేశ్ బాబు ట్వీట్‌..

భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది.

Mahesh Babu : ఫ‌లితంతో సంబంధం లేదు.. మీరు నిజ‌మైన ఛాంపియ‌న్ : మ‌హేశ్ బాబు ట్వీట్‌..

Super star Mahesh Babu on Vinesh phogats disqualification in paris olympics

Updated On : August 9, 2024 / 12:26 PM IST

Mahesh Babu – Vinesh phogat : భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. 100 గ్రాముల అధిక బ‌రువు ఉన్న కార‌ణంగా ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు ఒలింపిక్స్ క‌మిటీ ఆమెను డిస్ క్వాలిఫై చేసింది. ఒలింపిక్స్ చ‌రిత్ర‌లో ఫైన‌ల్‌కు చేరుతున్న మొద‌టి భార‌త మ‌హిళా రికార్డుల‌కు ఎక్కిన వినేశ్ ఫోగ‌ట్ ఖ‌చ్చితంగా మెడ‌ల్ తెస్తుంద‌ని స‌గ‌టు అభిమాని భావించాడు. అయితే.. అనూహ్యంగా ఆమె పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో భారతీయుల గుండెలు బాధ‌తో నిండిపోయాయి..

ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా ఆమెకు అండ‌గా అభిమానులతో పాటు సినీ సెల‌బ్రిటీలు కూడా నిల‌బ‌డుతున్నారు. స‌మంత, తాప్సీ లు ఇప్ప‌టికే ధైర్యం చెబుతూ పోస్ట్ చేయ‌గా తాజాగా మ‌హేశ్ భాబు కూడా ఆమెకు అండ‌గా నిలబ‌డ్డాడు. వినేశ్ నిజ‌మైన ఛాంపియ‌న్ అని మ‌హేశ్ బాబు అన్నారు.

Mr Bachchan Trailer : ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ ట్రైల‌ర్‌.. మాస్ మ‌హారాజా ఈజ్ బ్యాక్‌..!

‘ఈ రోజు ఫ‌లితంతో సంబంధం లేదు. మీరు నిర్ణ‌యాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్ప‌త‌నం. వినేశ్ ఫోగాట్‌.. మీ హృద‌యం నిజ‌మైన ఛాంపియ‌న్ అని మీరు అంద‌రికీ చూపించారు. క‌ష్ట స‌మ‌యాల్లో అండ‌గా నిల‌వ‌డానికి మీ ధృడ‌త్వం, బ‌లం అంద‌రికి స్ఫూర్తి. ప‌త‌కం వ‌చ్చిందా లేదా అన్న‌ది ముఖ్యం కాదు.. మీ స్ఫూర్తి మాలో ప్ర‌తి ఒక్క‌రిలో ప్ర‌కాశిస్తుంది. 1.4 బిలియ‌న్ హృద‌యాలు మీతో పాటు ఉన్నాయి.’ అని మ‌హేశ్ బాబు ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అంత‌క ముందు .. కొన్ని సమయాల్లో, ఎంతగానో పోరాడే వ్యక్తులు కఠినమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి.. కష్టాల మధ్య కూడా నిలదొక్కుకునే మీ అద్భుతమైన ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ కష్టసుఖాల్లో మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం సమంత అన్నారు.

Chiranjeevi : చిరంజీవి కోసం ఆ సినిమా టైటిల్.. ఇచ్చేసిన చిన్న సినిమా నిర్మాత..

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)