Chiranjeevi : చిరంజీవి కోసం ఆ సినిమా టైటిల్.. ఇచ్చేసిన చిన్న సినిమా నిర్మాత..

ఓ చిన్న సినిమా నిర్మాత తను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ని మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు.

Chiranjeevi : చిరంజీవి కోసం ఆ సినిమా టైటిల్.. ఇచ్చేసిన చిన్న సినిమా నిర్మాత..

Simbaa Movie Producer says their Movie Title given to Megastar Chiranjeevi

Updated On : August 7, 2024 / 1:38 PM IST

Chiranjeevi : ఇండస్ట్రీలో సినిమా టైటిల్స్ ముందుగానే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేయించుకుంటారు. అయితే ఎవరైనా తమకు కావాల్సిన టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేయించి ఉంటే వాళ్ళని అడిగి లేదా వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ టైటిల్ తీసుకుంటారు. గతంలో అనేకసార్లు ఇండస్ట్రీలో ఒకరు రిజిస్టర్ చేయించుకున్న టైటిల్స్ మరొకరు తీసుకున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ అడిగితే చిన్న సినిమాల వాళ్ళు ఏదో ఒక బెనిఫిట్ తో ఇస్తారు.

అలా ఓ చిన్న సినిమా నిర్మాత తను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు. నిర్మాత రాజేందర్ రెడ్డి సింబా అనే సినిమాతో ఆగస్టు 9న రాబోతున్నారు. జగపతి బాబు, అనసూయ ముఖ్య పాత్రల్లో మొక్కలు, అడవుల ఇంపార్టెన్స్ చెప్తూ తెరకెక్కింది సింబా. తాజాగా నిర్మాత రాజేందర్ రెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయం తెలిపాడు.

Also Read : Game Changer : హమ్మయ్య.. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..

నిర్మాత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముందు ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకున్నాం. ఆ టైటిల్ ని రిజిస్టర్ చేయించాము కూడా. కానీ చిరంజీవి గారి సినిమాకు అడిగారని ఆ టైటిల్ ని వాళ్లకు ఇచ్చాము. మేము ఆ తర్వాత కథకు తగ్గట్టు సింబా అనే టైటిల్ పెట్టుకున్నాము అని తెలిపారు.

మలయాళంలో వచ్చిన లూసిఫర్ సినిమాని మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ సినిమాగా తెరకెక్కించగా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.