Nani : ‘అంటే సుందరానికి’ వచ్చేస్తున్నాడు ఓటీటీలోకి..
అంటే సుందరానికి సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుంచి తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్.........
- Saketh U
- Published on- July 4, 2022 / 06:29 AM IST
Ante Sundaraniki
Ante Sundaraniki : న్యాచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా కలిసి నటించిన సినిమా అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి వచ్చి ఫ్యామిలీ లైవ్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోయినా సినిమా ఫ్యామిలీకి, యూత్ కి కనెక్ట్ అయి మంచి విజయం అందుకుంది. అమెరికాలో ఈ సినిమాతో మరోసారి 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి వరుసగా ఏడు సినిమాలతో రికార్డ్ సాధించాడు నాని.
Macharla Niyojakavargam : మరోసారి ఐటెంసాంగ్ లో అంజలి.. ఈ సారి నితిన్‌తో..
అంటే సుందరానికి సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో జులై 10 నుంచి తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ అధికారికంగా ప్రకటించింది. అంటే సుందరానికి సినిమా పోస్టర్ ని షేర్ చేసి..”సుందర్ అండ్ లీల వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేది గుర్తుంచుకోండి” అంటూ ట్వీట్ చేసింది నెట్‌ఫ్లిక్స్.
