Anupama Parameswaran : టిల్లుగాడు మొత్తం మార్చేశాడంటూ.. బాధ పడుతున్న అనుపమ ఫ్యాన్స్..

అనుపమ షేర్ చేసిన కొత్త వీడియో చూసి.. టిల్లుగాడు మొత్తం మార్చేశాడంటూ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు.

Anupama Parameswaran fans are worried about her latest video

Anupama Parameswaran : మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో తన రెగ్యులర్ ఫొటోలతో ఎంతోమంది అబ్బాయిల మనసు కొల్లగొట్టింది. అయితే మొన్నటివరకు పద్దతిగా ట్రెడిషనల్ లుక్స్ మెస్మరైజ్ చేసిన అనుపమ.. ఇప్పుడు మోడరన్ లుక్స్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ సిద్దు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నారు.

ఈ మూవీ నుంచి రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ లో అనుపమ చాలా హాట్ గా కనిపిస్తూ వచ్చారు. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో అయితే.. లిప్‌లాక్ కిస్‌లు, అందాల ఆరబోతతో కొత్త అనుపమ కనిపించారు. ఇది చూసిన అనుపమ ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు. ఇక తాజాగా అనుపమ.. తన వెకేషన్ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో కూడా అనుపమ అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.

Also read : Subhalekha Sudhakar : సోషల్ మీడియాలో ఫేక్ వార్తల వల్ల నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది

ఇక ఈ వీడియో కూడా చూసిన అనుపమ ఫ్యాన్స్.. పోస్టు కింద బాధతో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. “టిల్లుగాడు మొత్తం మార్చేశాడు. బేబీ కొంచెం పద్దతిగా ఉండు. బ్రేకప్ కంటే ఇది ఎక్కువ బాధిస్తుంది” అంటూ తెగ బాధ పడిపోతున్నారు. మరి ఫ్యాన్స్ పడుతున్న ఈ బాధని అనుపమ ఏమైనా లెక్కలోకి తీసుకుంటుందా లేదా చూడాలి.

Anupama Parameswaran fans are worried about her latest video

టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే.. మార్చి 29న రిలీజ్ కాబోతుంది. డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో.. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా ఆడియన్స్ కి తెగ నచ్చేయడంతో రిలీజ్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మరి ట్రైలర్ లోనే ఓ రేంజ్ రొమాన్స్ టిల్లు గాడు.. సినిమాలో ఇంకెంతటి రొమాన్స్ చూపించి అనుపమ ఫ్యాన్స్ కి బాధిస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు