Kathanar : అనుష్క పాన్ ఇండియా సినిమా ట్రైలర్ వచ్చేసింది.. భారీ పీరియాడిక్ ‘కథనార్’.. అదిరిందిగా..
మీరు కూడా అనుష్క కథనార్ ట్రైలర్ చూసేయండి.. (Kathanar)
- Saketh U
- Updated on- March 31, 2026 / 01:44 PM IST
Kathanar
Kathanar : అనుష్క బాహుబలి తర్వాత నిదానంగా అడపాదడపా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగులో ఘాటీ సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలయింది. అనుష్క ప్రస్తుతం మలయాళంలో కథనార్ అనే భారీ పీరియాడిక్ సినిమా చేస్తుంది.
శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ పై గోకులం గోపాలన్ నిర్మాణంలో రోజిన్ థామస్ దర్శకత్వంలో అనుష్క, జయసూర్య, ప్రభుదేవా, సనూప్ సన్, వినీత్, శాండీ మాస్టర్, హరీష్ ఉత్తమన్.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also See : Anasuya Bharadwaj : ఫ్యామిలీతో కలిసి పూజలు చేస్తున్న అనసూయ.. ఫొటోలు..
మీరు కూడా అనుష్క కథనార్ ట్రైలర్ చూసేయండి..
