Kandula Durgesh : భూములు ఇస్తాము.. సినీ పరిశ్రమకు ఏపీ మంత్రి ఆఫర్..

ఈ ఈవెంట్ కి మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. (Kandula Durgesh)

  • Published on- July 16, 2026 / 09:54 AM IST

Kandula Durgesh

Kandula Durgesh : ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ సినిమా షూటింగ్స్ చేయమని ప్రతిసారి ఇండస్ట్రీ వాళ్ళను కోరుతున్నారు. ఇటీవల బాలయ్య మూవీ ఓపెనింగ్ కూడా అమరావతిలో చేసారు. సినీ పరిశ్రమ వస్తే అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని చేతూనే వస్తున్నారు. తాజాగా మరోసారి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా గుంటూరులో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు.

Also Read : Hema : కొత్త కారు కొన్న నటి హేమ.. వామ్మో ఈ కారు ధర ఎన్ని కోట్లు అంటే..?

ఈవెంట్లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరుపున చెప్తున్నాను. మేమంతా తీసుకున్న నిర్ణయం ఒకటే. తెలుగు నేలపై తెలుగు చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోవాలి. ఇక్కడ మీకు అవసరమైనవన్నీ సింగిల్ విండో ద్వారా మీకు కావాల్సిన పర్మిషన్స్ ఇస్తాము.

మీరేదయినా స్టూడియోలు, డబ్బింగ్ స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్స్ నిర్మించాలి అనుకుంటే మేము తప్పకుండా సహకరిస్తాము. మీరు రండి ఇన్వెస్ట్మెంట్ చేయండి. దానికి అవసరమైన భూములు ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలియచేస్తున్నాను అని అన్నారు.

Also Read : Siddharth Galla Hyein Kim : కొరియన్ అమ్మాయితో మహేష్ మేనల్లుడు నిశ్చితార్థం, పసుపు వేడుక.. మరిన్ని ఫోటోలు చూశారా..?

అలాగే.. నిర్మాత నాగవంశీ కోరిన విధంగా టికెట్ రేట్ల విషయంలో ఒక జీవోని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుంటూరు – విజయవాడ మధ్య అటు వైజాగ్, ఇటు తిరుపతి ఇక్కడ ఒక అందమైన సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని తెలిపారు. ఇలా ఈవెంట్స్ జరిగిన ప్రతిసారి ఏపీ నాయకులూ సినీ పరిశ్రమ వాళ్ళను రండి, సపోర్ట్ చేస్తాము అని చెప్తూనే ఉన్నారు. మరి సినీ ప్రముఖులు ఎంతమంది ఏపీలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తారో చూడాలి.