Vangalapudi Anitha : టీవీ షోలో ఏపీ హోమ్ మినిస్టర్.. డ్యాన్స్ వేసి సందడి చేసిన వంగలపూడి అనిత.. ప్రోమో వైరల్..

మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..(Vangalapudi Anitha)

  • Published on- October 9, 2026 / 03:25 PM IST

Vangalapudi Anitha

Vangalapudi Anitha : ఈటీవీలో ప్రతి పండగకు స్పెషల్ షో చేస్తారని తెలిసిందే. రాబోయే దసరాకు దసరాకి విడుదల అనే స్పెషల్ ప్రోగ్రాంని చేసారు. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేసిన ఈ ఈవెంట్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేసారు. ఈ స్పెషల్ దసరా షోకి ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వచ్చి సందడి చేసారు. షోలో ఉన్న పలువురు నటీనటులు, గెస్టులతో అనిత కూడా కాలు కదిపి స్టెప్పులు వేశారు, సరదాగా మాట్లాడారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

ఈ ఎపిసోడ్ కి శైలజ కిరణ్, ద్రోణవల్లి హారిక, సుమ, అనిల్ రావిపూడి.. మరికొంతమంది ప్రముఖులు గెస్టులుగా హాజరయి సందడి చేసారు. ఈ స్పెషల్ షో దసరా పండగ రోజు ఈటీవీలో టెలికాస్ట్ అవ్వనుంది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..