AR Rahman: ‘రామాయణ’ కోసం రెహమాన్ రికార్డ్ పారితోషికం.. ఇండియాలోనే హయ్యెస్ట్.. ఎన్ని కోట్లో తెలుసా?

రామాయణ సినిమా కోసం రెహమాన్(AR Rahman) తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ar rahman getting huge remuneration for ramayana movie

  • ‘రామాయణ’ సినిమాకు రెహమాన్ మ్యూజిక్
  • రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటున్న ఆస్కార్ విజేత
  • ఇదే ఇండియాలో హైయ్యెస్ట్ అవ్వడం విశేషం

AR Rahman: బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా నిలుస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన టీజర్, అందులోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ ఇతిహాసాన్ని వెండితెరపై మునుపెన్నడూ లేని విధంగా ఆవిష్కరించబోతోంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

Ranbir Kapoor: ‘రామాయణ’లో రణ్‌బీర్ డ్యూయెల్ రోల్.. ‘రాముడి’తోపాటు మరో పవర్ ఫుల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన హీరో

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందించడం మరో విశేషం. రామాయణం వంటి పౌరాణిక చిత్రానికి ఆయన అందించే మ్యూజిక్ ప్రాణం పోస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఏకంగా రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక సంగీత దర్శకుడికి అందుతున్న అత్యధిక రెమ్యునరేషన్ ఇదే కావడం విశేషం. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా, సినిమా లాభాల్లో కూడా ఆయన వాటా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఏఆర్ రెహమాన్ తన అద్భుతమైన మ్యూజిక్ అండ్ బీజీఎమ్ తో సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడంలో టాప్. అందుకే నిర్మాతలు కాంప్రమైజ్ అవలేదట. హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఈ సినిమా కోసం పనిచేస్తుండటంతో, రెహమాన్ సంగీతం అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా హీరోలు, దర్శకులు సినిమా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవడం చూశాం. కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రాఫిట్ షేరింగ్‌లో భాగస్వామి కావడం ఇదే మొదటిసారి. దీంతో, ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న రామాయణ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.