Kushi : ఖుషి సెకండ్ సింగల్ ప్రోమో రిలీజ్.. నాతో రా ‘ఆరాధ్య’..

విజయ్ అండ్ సమంత నటిస్తున్న ఖుషి నుంచి సెకండ్ సింగల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. పూర్తి సాంగ్ ని..

Aradhya song promo released from Vijay Deverakonda Samantha Kushi

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరిస్తున్నారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ లవ్ స్టోరీకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘నా రోజా నువ్వే’ అంటూ సాగే సాంగ్ ని రిలీజ్ చేయగా యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేసింది.

Ranveer – Deepika : రణవీర్ దీపికా విడాకులు.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన హీరో..

ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ‘ఆరాధ్య’ అనే సాగే పాట ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ని జులై 12న రిలీజ్ చేయనున్నారు. ఇక మొదటి పాటకి లిరిక్స్ రాసిన దర్శకుడు శివ నిర్వాణ.. ఈ సెకండ్ సాంగ్ కి కూడా సాహిత్యం అందిస్తున్నాడు. సిద్ శ్రీరామ్, చిన్మయి పాటని పాడారు. మొదటి సాంగ్ లాగానే ఈ పాట కూడా సూపర్ హిట్ అవ్వనుందని తెలుస్తుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

Guntur Karam : గుంటూరు కారం సినిమానే టార్గెట్ చేస్తున్నారు అందరూ.. ఎందుకో అర్ధం కావడం లేదు.. థమన్!

కాగా ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం విజయ్ అండ్ సమంత ఇద్దరు ప్లాప్‌ల్లో ఉన్నారు. దీంతో వీరిద్దరి నుంచి అభిమానులు ఒక్క హిట్టు కోసం చూస్తున్నారు. శివ నిర్వాణకి లవ్ స్టోరీస్ లో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. దీంతో ఈ సినిమా పై సామ్ అండ్ విజయ్ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. మరి దర్శకుడు వారి అంచనాలను నిలబెడతాడా? లేదా ? చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు