Anand Sai Son: పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఆనంద్ సాయి కొడుకు అరెస్ట్..
తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు సందీప్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. (Anand Sai)
- Saketh U
- Updated on- September 1, 2026 / 04:20 PM IST
Art Director Anand Sai Son Sandeep Arrested
Anand Sai : ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. పవన్ ఏ ఆధ్యాత్మిక పర్యటన చేసినా పక్కన ఆనంద్ సాయి ఉండాల్సిందే. 30 ఏళ్లకు పైగా స్నేహం వీరిది. ఆనంద్ సాయి ఆర్కిటెక్ట్ గా యాదాద్రి టెంపుల్ కట్టారు. ఎన్నో ఆలయాలకు నమూనాలు గీశారు. భారీ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు.
Also Read : Jabardasth Comedian : జబర్దస్త్ నుంచి వెళ్లిపోతున్న మరో కమెడియన్..
తాజాగా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు సందీప్ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. సందీప్ యాక్సిడెంట్ చేసి పారిపోయిన ఘటనలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్ లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం. పోలీసులు ఈ యాక్సిడెంట్ పై విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ హిట్ & రన్ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
