SIT Movie : జీ5 ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న SIT మూవీ.. సెకండ్ పార్ట్ పై డైరెక్టర్ ఏమన్నారంటే..

ప్రస్తుతం SIT సినిమా జీ5 ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

Arvind Krishna SIT Movie Trending in Zee 5 OTT

SIT Movie : అరవింద్ కృష్ణ(Arvind Krishna), రజత్ రాఘవ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘SIT'(సిట్ – స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్). SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై నాగిరెడ్డి, తేజ్ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో ఈ ‘సిట్’ సినిమా తెరకెక్కింది. ఇందులో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించాడు. నటాషా దోషి హీరోయిన్ గా నటించగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సిట్ సినిమా జీ5 ఓటీటీలో మే 10 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా జీ5 ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు.

Also Read : Jabardasth : షాకింగ్ న్యూస్.. ఏకంగా జబర్దస్త్‌నే తీసేస్తున్నారు.. ఏడ్చేసిన రష్మీ, కుష్బూ, కంటెస్టెంట్స్..

సిట్ మూవీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కడప జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన నేను డిగ్రీ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఐసెట్, డీఎఫ్ టెక్ కోర్సులకు కోచింగ్ తీసుకున్నాను. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశాను. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా అలువురు దర్శకుల వద్ద పని చేశాను. SIT మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాను. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా మా పెద్దన్న నాకు అండగా నిలబడ్డాడు. పదిహేనేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేయడంతో ఈ సినిమా మొదలైంది. ముందుగా వెబ్ సిరీస్ అనుకున్నాం కానీ సినిమా అయితేనే బాగుంటుందనిపించింది. అరవింద్ కృష్ణ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇది ఓటీటీ కంటెంట్ కాబట్టి ముందు నుంచి కూడా ఓటీటీ కోసమే అనుకోని తీసాం. జీ5 లో సిట్ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండటం ఆనందంగా ఉంది. దీనికి సెకండ్ పార్ట్ ఎప్పుడని అంతా అడుగుతున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు