Danny : ‘డానీ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. బోల్డ్, రా & రస్టిక్..
మీరు కూడా డానీ ఫస్ట్ గ్లింప్స్ చూసేయండి..
- Saketh U
- Published on- September 18, 2026 / 10:51 PM IST
Danny
Danny : ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా డానీ. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల పై రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ స్ట్రైక్ ను తాజాగా విడుదల చేశారు. ఇందులో హీరో ఓ అమ్మాయితో బీచ్ లో మాట్లాడే సీన్ తో ఆసక్తికర డైలాగ్స్ తో సాగింది. చివర్లో యాక్షన్ లుక్ లో కనిపించాడు హీరో. బోల్డ్, రా అండ్ రస్టిక్‌గా డానీ రాబోతుంది. గతంలో కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన నాటకం, కళింగ సినిమాలు బాగానే మెప్పించాయి. మరి ఈ డానీ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
మీరు కూడా డానీ ఫస్ట్ గ్లింప్స్ చూసేయండి..
