Ashu Reddy: రూ.9 కోట్ల మోసం.. హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై కేసును కొట్టేయాలని పిటిషన్!

రూ.9 కోట్ల మోసం కేసులో హైకోర్టును ఆశ్రయించిన ఆషు రెడ్డి(Ashu Reddy).

Ashu Reddy approaches High Court in Rs 9 crore fraud case

  • అషురెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్.
  • తొమ్మిది కోట్ల మోసం కేసు.
  • పోలీసుల తీరుపై నటి అసహనం.

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డి తనపై నమోదైన భారీ ఆర్థిక మోసం కేసులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ. 9.35 కోట్లు వసూలు చేశారంటూ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను సవాలు చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని, తనను వ్యక్తిగతంగా దెబ్బతీయడానికే ఇలాంటి కేసులు పెట్టారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

Pujita Ponnada: రంగస్థలంలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.. గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పోలీసుల దర్యాప్తు తీరుపై అషురెడ్డి(Ashu Reddy) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కనీసం తన వివరణ తీసుకోకుండానే, ఏకపక్షంగా కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమని ఆమె వాదిస్తున్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఈ విచారణ సాగుతోందని, తక్షణమే ఈ కేసు విచారణపై స్టే విధించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి చర్యల నుండి తనకు రక్షణ కల్పించాలని, పోలీసుల జోక్యం లేకుండా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.

ఈ పిటిషన్ త్వరలోనే హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే, మరోవైపు పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, బాధిత ఎన్నారై సమర్పించిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా భారీ మొత్తంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను, ఇతర సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు. అషురెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై కోర్టు స్పందన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.