Ashu Reddy : ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ.. అషు రెడ్డి వాళ్ల అమ్మ ఏం చెప్పిందంటే..
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మతో తను చేసిన బోల్ద్ ఇంటర్వూ గురించి అమ్మ ఇచ్చిన కాంప్లిమెంట్‌కి అషు రెడ్డి మురిసిపోయింది..
- sekhar
- Updated on- September 8, 2021 / 06:42 PM IST
Ashu Reddy Mother
Ashu Reddy: కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు పక్కన పెట్టేసి పార్టీలు, ఇంటర్వూలతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఆరియానాతో ఆర్జీవీ చేసిన బోల్డ్ ఇంటర్వూ ఏ రేంజ్లో సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. రీసెంట్గా మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ అనడం కంటే అంతకుమించి అనేలా చేసిన ఇంటర్వూ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది.
ఆర్జీవీ తనను తాను అషుకి ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అషు ఆయనెవరో తెలియనట్లు నటించడం.. వర్మతో మాటలు కలపడం.. అతను నీ థైస్ బాగున్నాయని చెప్పడం.. దీంతో అషు చెంపదెబ్బ కొట్టడం.. నేనేం తక్కువ అనేంతలా తను కూడా ఆర్జీవీతో బోల్డ్‌గా మాట్లాడడం.. ఇలా రచ్చ రచ్చగా సాగింది ఆ ఇంటర్వూ.
నెటిజన్లు షాక్ అవుతున్న ఈ కాంట్రవర్షియల్ ఇంటర్వూ గురించి రీసెంట్గా అషు రెడ్డి తల్లి స్పందించారు. అషు రెడ్డి ఇన్స్టాగ్రామ్ లైవ్ చిట్ చాట్‌లో నెటిజన్లతో ముచ్చటిస్తుండగా.. ఇంతలో వాళ్ల అమ్మ ఎంటర్ అయ్యి.. ‘ఇంటర్వూ చూశాను, బాగుంది.. బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా మెసేజ్ చెప్పావు.. సొసైటీకి మంచి మెసెజే ఇచ్చావు.. సరే బాగానే ఉంది..’ అంటూ ఆప్యాయంగా అషు బుగ్గలు నిమిరారు.
తల్లి కాంప్లిమెంట్‌తో ఆమె హ్యాపీగా ఫీలవ్వగా.. అషు రెడ్డి అమ్మ కామెంట్‌తో ఆర్జీవీ మరోసారి చెలరేగిపోయాడు. ‘కపట సమాజానికి కావాల్సిన తల్లిదండ్రుల్లో అషు రెడ్డి తల్లి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచారు. ఆమె లాగే మోడర్న్ థింకింగ్‌కి అనుగుణంగా పేరెంట్స్ పిల్లల్ని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలి’ అంటూ అషు రెడ్డి వీడియోను షేర్ చేశాడు ఆర్జీవీ. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
