Avatar 3 OTT: ఎట్టకేలకు OTTలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

విడుదలైన ఆరునెలకు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్న అవతార్: ది ఫైర్ అండ్ యాష్(Avatar 3 OTT) మూవీ.

Avatar The Fire and Ash is ready for streaming on JioCinema

  • జూన్ 24 నుండి ఓటీటీ స్ట్రీమింగ్.
  • సల్లీ కుటుంబంపై ప్రతీకార దాడి.
  • అగ్ని తెగతో భారీ యుద్ధం.

Avatar 3 OTT: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్(Avatar 3 OTT)’ థియేటర్లలో సంచలనం సృష్టించింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. చాలా కాలం క్రితమే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. జూన్ 24 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రెండో భాగంలో తమ కుమారుడిని కోల్పోయిన జేక్ సల్లీ, నేతిరి కుటుంబం ఆ బాధ నుండి కోలుకోకముందే మరో గండం ఎదురవుతుంది. పాత శత్రువు కల్నల్ క్వారిచ్‌తో పాటు, ఈసారి అగ్ని తెగ నాయకురాలు ‘వరంగ్’ కూడా తోడవడంతో పండోరా గ్రహంపై మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

Anjali: అరుణాచలేశ్వరుని సన్నిధిలో అంజలి.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్

ఆర్డీఏ బృందంతో చేతులు కలిపిన శత్రువులు అత్యాధునిక ఆయుధాలతో సల్లీ కుటుంబాన్ని, వారి విశ్వాస దైవమైన ఈవాను అంతం చేయడానికి సిద్ధమవుతారు. అగ్ని తెగ కుట్రలను, కల్నల్ ప్రతీకారేచ్ఛను జేక్ సల్లీ తన పిల్లలతో కలిసి ఎలా అడ్డుకున్నాడనేదే ఈ చిత్ర ప్రధానాంశం. అద్భుతమైన గ్రాఫిక్స్, భావోద్వేగాల కలయికతో సాగే ఈ విజువల్ కావ్యం ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అగ్ని వర్షాన్ని కురిపించే శత్రువులపై సల్లీ పోరాటం ఏ తీరానికి చేరిందో చూడాలంటే ఓటీటీలో వీక్షించాల్సిందే!