Baby Movie : బేబీ దర్శకుడికి కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్.. తన నెక్స్ట్ సినిమా కూడా..
బేబీ దర్శకుడు సాయి రాజేష్ కి మరో కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. అలాగే సాయి రాజేష్ నెక్స్ట్ సినిమా..
- gum 95921
- Published on- September 29, 2023 / 08:46 PM IST
Baby Movie producer SKN gifted car to Director Sai Rajesh
Baby Movie : ఇటీవల టాలీవుడ్ లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచలన విజయం అందుకున్న మూవీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ డైరెక్ట్ చేశాడు. శ్రీనివాస కుమార్ (SKN) ఈ సినిమాని నిర్మించాడు. కేవలం 10 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.
Vijay Antony : కూతురు మరణం నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ.. పాన్ ఇండియా మూవీతో..
ఇక ఇటీవలే థియేటర్స్ లో 50 రోజులు పండగని కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహాలోకి వచ్చిన 32 గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఈ మూవీ ఇంతటి విజయం అవ్వడంతో నిర్మాత SKN దర్శకుడు సాయి రాజేష్ కి ఖరీదైన కారుని బహుమతిగా అందించాడు. బ్రాండ్ న్యూ మోడల్ బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Parineeti Chopra : వీడియో గిఫ్ట్ ఇచ్చి భర్తని సర్ప్రైజ్ చేసిన పరిణీతి చోప్రా.. ఆ వీడియో చూశారా..?
అయితే ఈ మూవీ నిర్మాత దర్శకుడికి కారు బహుమతిగా ఇవ్వడం ఇది రెండోసారి. ఈ సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన కాన్ఫిడెన్స్ తో డైరెక్టర్ సాయి రాజేష్ కు ఒక కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ మూవీ కోట్ల వర్షం కురిపించడంతో ఇప్పుడు బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చాడు. కాగా సాయి రాజేష్ నెక్స్ట్ సినిమా కూడా నిర్మాత ఎస్కేఎన్ తోనే చేయబోతున్నాడట. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రాబోయే ఈ మూవీ గురించిన డీటెయిల్స్ త్వరలో అధికారికంగా తెలియజేయనున్నారు.
