Badri Re-Release : పవన్ కళ్యాణ్ బద్రి రిలీజ్ డేట్ చేంజ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రం 'బద్రి' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ డేట్ చేంజ్ అయ్యిందట. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది.
- gum 95921
- Published On : January 25, 2023 / 01:01 PM IST
Badri Re-Release
Badri Re-Release : టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస పెట్టి స్టార్ హీరోల వింటేజ్ సినిమాలు అన్ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్టు మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి వాటి సత్తా చాటుతూ వస్తున్నాయి. న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయ్యిన పవన్ అల్ టైం సూపర్ హిట్టు చిత్రం ‘ఖుషి’ రీ రిలీజ్ సినిమాల్లో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘బద్రి’ని కూడా రీ రిలీజ్ చేయడానికి ఇటీవల డేట్ ని అనౌన్స్ చేశారు.
Pawan Kalyan : నాటు నాటు ఆస్కార్ గెలవాలి.. పవన్ కళ్యాణ్!
రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు డేట్ చేంజ్ అయ్యిందట. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యింది. వచ్చే నెల (ఫిబ్రవరి) 4న ఈ మూవీ రీ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్వాహుకులు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. కాగా ఈ సినిమాని పూరీజగన్నాధ్ డైరెక్ట్ చేశాడు. దర్శకుడిగా పూరీకి ఇది తొలి మూవీ. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చి స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు.
ఈ చిత్రంలోని పవన్ కళ్యాణ్ మ్యానరిజం అండ్ ఆటిట్యూడ్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు మెడ మీద చెయ్యి పెట్టుకున్న మ్యానరిజం పవన్ కి సిగ్నేచర్‌లా మారిపోయింది. ఈ మూవీలో హీరోయిన్స్ గా రేణూ దేశాయ్, అమీషా పటేల్ నటించారు. ప్రేమదేశం వంటి ట్రై అంగుళర్ లవ్ స్టోరీ చూసిన ఆడియన్స్ కి ఈ మూవీలోని ట్రై అంగుళర్ లవ్ స్టోరీ కొత్తగా అనిపించింది. ఇక ఈ సినిమాకి రమణ గోగుల ఇచ్చిన సంగీతం మరో హైలైట్. మూవీలోని ‘బంగాళాఖాతంలో’ సాంగ్ అప్పటి యూత్ ని ఒక ఊపు ఊపేసింది.
#Badri Re-Release On February 4th 2023 pic.twitter.com/wMwQbCl99Z
— VizagTheatres (@Vizag_Theatres) January 25, 2023
