Baladitya
Baladitya : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన బాలాదిత్య చిన్నప్పుడే చాలా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా సినిమాలు, సీరియల్స్ చేసాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న బాలాదిత్య ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, హీరోగా సీరియల్స్ చేస్తున్నాడు. తాజాగా బాలాదిత్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక విషయాలు చెప్పాడు.
ఈ క్రమంలో బాలాదిత్య తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన నటీనటుల గురించి చెప్పగా రోజా గురించి ఆసక్తికర విషయం తెలిపాడు.
Also See : Jr NTR Mother : బిఆర్ఎస్ నేతను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
బాలాదిత్య మాట్లాడుతూ.. రోజా అక్కతో బాగా ఆడుకునేవాడ్ని. అన్న, రాయుడు గారు నాయుడు గారు సినిమాల్లో రోజా గారితో కలిసి చేశాను. రాయుడు గారు నాయుడు గారు సినిమాకు 25 రోజులు కలిసి పని చేసాము. కాకినాడ దగ్గర యానంలో షూట్. నేను, రోజా అక్క డైలీ కార్ లో వెళ్లి వచ్చేవాళ్ళం. ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. పాటలు, డ్యాన్సులు, ఆటలు అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము అని తెలిపారు.
అలాగే హీరోయిన్ రంభతో కూడా జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు. బాలాదిత్య మాట్లాడుతూ.. రంభ రెండో సినిమా తెలుగులో ఏవండీ ఆవిడొచ్చింది. కెరీర్ మొదట్లో కాబట్టి ఆ సినిమాలో రంభ టేక్స్ ఎక్కువ తీసుకునేది. ఓ సారి డైరెక్టర్ ఈవీవీ నన్ను పిలిచి ఆ డైలాగ్ చెప్పి చూపించు అంటే అందరి ముందు రంభ గారు చెప్పాల్సిన డైలాగ్ నేను చెప్పాను. ఆ విషయంలో రంభ గారు బాధపడేది. తర్వాత మా అమ్మ దగరికి వచ్చి వీడ్ని షూటింగ్ కి తీసుకురాకండి అని సరదాగా కంప్లైంట్ ఇచ్చేది నా మీద అని తెలిపాడు.
Also See : Vaishnavi Chaitanya : తమిళ హీరోతో జిమ్ లో కష్టపడుతున్న వైష్ణవి చైతన్య..